/rtv/media/media_files/2025/10/30/mahesh-babu-2025-10-30-13-59-14.jpg)
mahesh babu
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మాల్దీవ్స్ లో చిల్ అవుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి SSMB29 షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్.. కాస్త బ్రేక్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ లో మహేష్ బాబు స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలను మహేష్ బాబు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. సంపూర్ణ ఆనందం! మాకు అద్భుతమైన స్టే అందించిన జోయాలికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు మహేష్ బాబు.
Also Read : ఉఫ్.. నెట్టింట సెగలు పుట్టిస్తున్న పొడువుకాళ్ల సుందరి.. చిట్టీ హాట్ ఫొటో షూట్!
40 శాతం షూటింగ్ పూర్తి
RRR తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న SSMB29 ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 40% పూర్తవగా.. అందులో యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు, పాటలను చిత్రీకరించారు. సినిమాలోని దాదాపు 90% శాతం సన్నివేశాలు ఈస్ట్ ఆఫ్రీకాలోని కెన్యాలోనే చిత్రీకరించినట్లు సమాచారం. ఇటీవలే రాజమౌళి టీమ్ కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకొని.. హైదరాబాద్ వచ్చారు. పురాణ కథల ఆధారంతో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు 'గ్లోబ్ ట్రాట్టర్' (ప్రపంచ యాత్రికుడి) పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rathika Ravinder: బంపరాఫర్ కొట్టేసిన 'బిగ్‌బాస్' బ్యూటీ.. ఏకంగా పాన్ ఇండియా సినిమా..!
Follow Us