'సంక్రాంతికి వస్తున్నాం'లో పాట పాడిన వెంకటేష్.. వీడియో వైరల్!

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేయగా.. మూడో పాటను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూడో పాటను వెంకటేష్ పాడినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

New Update
sankranthiki vastunnam

sankranthiki vastunnam Photograph: (sankranthiki vastunnam)

విమర్శలు లేని టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంకాంత్రి కానుకగా 2025 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా షుటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్

ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే

త్వరలో మూడో సాంగ్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత రమణ గోగుల ఈ సినిమాలో గోదారిగట్టు మీద రామచిలకవే పాట పాడారు. ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన మీనూ సాంగ్ కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. దీంతో మూడో పాటను టీమ్ మేకర్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా తెలిపారు.

ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్!

దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మూడో పాటను ఎక్స్‌ట్రార్డనరీ వాయిస్‌తో పాడించాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో హీరో వెంకటేష్ వచ్చి.. నేను పాడతా అంటూ తన వెనుక తిరుగుతారు. వెంకీ బాధ భరించలేక అనిల్ రావిపూడి పాట పాడటానికి ఒప్పుకుంటాడు. మూడో పాటను వెంకీ మామ పాడాడు. త్వరలో ఈ పాటను విడుదల చేయనున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన ఓ చిన్న క్లిప్‌ను కూడా లాస్ట్‌లో యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు