Samantha : హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్

హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్ వెల్లడించింది. చికెన్‌ గున్యా బారిన పడినట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టింది. జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేసింది. సమంత త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

New Update
samantha chikungunya

samantha chikungunya Photograph: (samantha chikungunya)

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్ వెల్లడించింది.  ఇటీవల తాను చికెన్‌ గున్యా బారిన పడినట్లుగా వెల్లడించింది.  అయితే ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా సమంత పోస్ట్ పెట్టింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పులు నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటాయి అంటూ ఓ పోస్టును జత చేసింది. సమంత త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read :  చెర్రీని తొక్కేసిన బన్నీ..!

Also Read :  మెగా ఫ్యాన్స్కు బిగ్ షాక్‌.. భారీగా తగ్గిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్

గతంలో మయోసైటిస్‌

గతంలో సమంత (Samantha)  మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.  ఖుషి మూవీ టైమ్ లో తాను ఈ వ్యాధి బారిన పడినట్లుగా తెలిసిందని సామ్ తెలిపింది.   అప్పటి నుంచి తన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టిందని, ఆ వ్యాధిని గుర్తించడానికి తనకు చాలా టైమ్ పట్టిందని.. దీనినుంచి కోలుకోవడానికి మరింత టైమ్ పట్టొచ్చు అని సామ్ వివరించింది.  మయోసైటిస్ చికిత్స కోసం సామ్ మెడిసిన్స్, ఆయుర్వేదం, భూటాన్‌లో ప్రకృతి వైద్యం ఇలా రకరకాల పద్దతుల్ని ప్రయత్నించింది. 

Also Read :  ‘గేమ్ ఛేంజర్’పై చిరంజీవి సంచలన ట్వీట్.. వారందరి పేర్లు ప్రస్తావిస్తూ!

ఇక సమంత చివరిసారిగా హిందీ వెబ్ సిరీస్  ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సామ్ ఏజెంట్‌గా కనిపించింది.  రాజ్ & డికె (రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె) దర్శకత్వం వహించారు.  ఇందులో  వరుణ్ ధావన్, కే కే మీనన్, సాకిబ్ సలీమ్ మరియు సికిందర్ ఖేర్ కూడా నటించారు.  ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. వెబ్ సిరీస్‌లో స్టంట్స్‌తో యాక్షన్ సీన్లలో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది సమంత.. ఒక కూతురికి తల్లిగా కన్నీళ్లు పెట్టించింది.  

Also Read  :  పరీక్షలు రాయడం ఇష్టం లేక బాంబు బెదిరింపు ఈమెయిల్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు