Mega Vs Allu: చెర్రీని తొక్కేసిన బన్నీ..! గేమ్ ఛేంజర్ పై నెట్టింట ట్రోల్స్ రచ్చ

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్  పై  మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో మెగా VS అల్లు ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. పుష్ప రికార్డులకు గేమ్ ఛేంజర్ చాలా దూరంలో ఉందని. మెగా VS అల్లు ఫైట్ లో బన్నీనే గెలిచాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

New Update
mega vs allu

mega vs allu

Mega Vs Allu: మెగా అల్లు ఫైట్ లో బన్నీ గెలిచాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శుక్రవారం -నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రాంచరణ్ గేమ్ ఛేంజర్  పై  మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. జనాలకు సినిమా పెద్దగా ఎక్కలేదంటూ నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ షో తర్వాత ఫ్యాన్స్ నుంచి నిరుత్సాహం వ్యక్తమవుతోంది. హైప్ అందుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప రికార్డులకు గేమ్ ఛేంజర్ చాలా దూరంలో నిలిచిందని చెబుతున్నారు. బన్నీని పట్టుకోలేకపో యారని.. మెగా VS అల్లు ఫైట్ లో బన్నీ గెలిచాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

బన్నీని పట్టుకోలేకపోయాడు !

సినిమా స్క్రీనింగ్ సమయంలో  కొన్ని థియేటర్ల వద్ద అభిమానులు వ్యంగ్యంగా కామెడీ కూడా చేస్తున్నారు. మమ్మల్ని పట్టుకోలేకపోయారు.. దమ్ముంటే పట్టుకోండి అంటూ ఓ అభిమాని రెచ్చిపోయాడు. పుష్ప 2 సినిమాలోని దమ్ముంటే పట్టు కోరా షెకావత్  అనే డైలాగ్ ని మార్చి..  దమ్ముంటే మా హీరో రికార్డులను పట్టుకోండి అంటూ సోషల్  మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బన్నీని రామ్ చరణ్ పట్టుకో లేకపోయాడంటూ ట్వీట్లు చేస్తున్నారు. మెగా అల్లు ఫైట్ లో బన్నీ గెలిచాడు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు ఊహించినంత హైప్ రాకపోవడంతో రామ్ చరణ్  ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు.

ఇండియాలో రూ. 40 కోట్ల గ్రాస్ వరకు అడ్వా న్స్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం. వాటిలో తమిళం నుంచి రూ. 54 లక్షలు, హిందీ బుకింగ్స్ రూ. 2.14 కోట్లు, తెలుగులో రూ.16 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఓవర్ సీస్ లో పది కోట్లుకుపైగా గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు ప్రముఖ ట్రేడ్ వెబ్ సైట్స్ తెలిపాయి. 

ఫస్ట్ డే కలెక్షన్స్ 

తొలిరోజు  గేమ్ ఛేంజర్ ఇండియాలో ఈ మూవీ రూ.  47 కోట్లు వసూలు చేసింది.  తెలుగులో రూ. 38 కోట్లు, తమిళంలో రూ. 2 కోట్లు వసూలు చేసింది. ఇక హిందీ విషయానికి వస్తే ఈ సినిమా రూ. కోట్ల రూపాయలను రాబట్టింది. కన్నడలో రూ.  0.1 కోట్లు, మలయాళంలో రూ.  0.03 కోట్లు రాబట్టింది.  

Also Read: చంపడంలో పీహెచ్‌డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు