CHIRANJEEVI: ‘గేమ్ ఛేంజర్’పై చిరంజీవి సంచలన ట్వీట్.. వారందరి పేర్లు ప్రస్తావిస్తూ!

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఒకవైపు అప్పన్నగా, మరోవైపు IAS అధికారి రామ్ నందన్‌‌గా రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించాడు. అతడి నటనకు చాలా మంది ప్రశంసలు కురిపించడం చూసి ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

New Update
CHIRANJEEVI TWEET ON GAME CHANGER MOVIE

CHIRANJEEVI TWEET ON GAME CHANGER MOVIE

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. నీతిమంతుడైన సిద్ధాంతకర్త అప్పన్నగా, వ్యవస్థను శుద్ధి చేయడానికి దృఢ సంకల్పం ఉన్న IAS అధికారి రామ్ నందన్ పాత్రకు రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. అతడి నటనకు చాలా మంది ప్రశంసలు కురిపించడం చూసి ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశారు.

Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ

Also Read: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్‌ భార్య

అందరికీ కంగ్రాట్స్

ఈ మేరకు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ఎస్ జే సూర్యకి, అలాగే హీరోయిన్లు కియారా అద్వానీ, అంజలికి, నిర్మాత దిల్ రాజుకి కంగ్రాట్స్ చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు శంకర్ అండ్ సినిమా బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అతడి ట్వీట్ వైరల్ అవుతోంది. 

Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

ఇదిలా ఉంటే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. కానీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. సినిమా ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కొందరేమో సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరేమో ఏంటీ సినిమా అస్సలు బాలేదని చెబుతున్నారు. సినిమాకి రామ్ చరణ్ యాక్టింగ్ ఒక్కటే హైలైట్ అంటూ పేర్కొంటున్నారు. 

Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

శంకర్ మార్క్ కనిపించలేదు

కానీ దర్శకుడు శంకర్ మార్క్ ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. అంతా ఔటడేటెడ్ స్టోరీ అంటూ అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించినట్లుగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరేమో ఇది వన్ మ్యాన్ షో అని.. రామ్ చరణ్ మాత్రమే యాక్టింగ్‌తో అదగొట్టేశాడని చెబుతున్నారు. ఏది ఏమైనా 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇలాంటి రిజల్ట్‌ను ఎవరూ ఊహించలేరనే చెప్పాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు