రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!

రోడ్డు మీద ఉమ్మివేసే వారికి ఊహించని షాక్ ఇస్తోంది గుజరాత్ లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్. పాన్, గుట్కా, తదితరాలు ఉమ్మివేసే వాళ్లకు భారీ జరిమానాలు విధిస్తోంది. 4500 కెమెరాలను ఏర్పాటు చేసి రూ.9 లక్షల వరకు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. 

author-image
By srinivas
New Update
drer

Gujarath: రోడ్డు మీద ఉమ్మివేసే వారికి ఊహించని షాక్ ఇస్తోంది గుజరాత్ లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్. ఇష్టారీతిన పాన్, గుట్కా, తదితరాలు ఉమ్మివేసే వాళ్ల భారీ జరిమానాలు విధిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో 4500 కెమెరాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్.. 24X7 పర్యవేక్షిస్తోంది. తద్వారా రోడ్లపై ఉమ్మివేసే వ్యక్తులను గుర్తించి పట్టుకుని ఫైన్ విధిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.9 లక్షల వరకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. 

మరింత కఠిన చర్యలు..

ఈ మేరకు పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం దృష్ట్యా సూరత్ మున్సిపాలిటీ ఇందుకు సంబంధించి భారీ స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. సీసీ కెమెరాల ద్వారా చర్యలకు పాల్పడటంతోపాటు భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. రానున్న రోజుల్లో మార్పు కనిపించకపోతే మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు