మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు! మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. BJP నేతలు తెలంగాణ సర్కార్ పై అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. By Bhavana 09 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Revanth Reddy- Modi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ముంబై చేరుకున్నారు. మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు, ఏఐసీసీ జాతీయ మీడియా కమిటీ ఛైర్మన్ పవన్ ఖేరా, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఈరోజు సాయంత్రం వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబైలోనే ఉంటున్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ...గత కొంత కాలంగా మహారాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్దపు ప్రచారం చేస్తున్నారు. Also Read: Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన చివరికీ ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలు పై అబద్దాలు చెప్పడం మొదలు పెట్టారు. మోదీ ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామంటూ రేవంత్ మోదీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలు పై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చానని రేవంత్ అన్నారు. Also Read: Brazil: విమానాశ్రయంలో కాల్పులు...ఒకరి మృతి! దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని రేవంత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ అనుకున్నారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం...ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసామని రేవంత్ చెప్పుకొచ్చారు. Also Read: Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు మృతి ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్నారు. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం..ఆ తరువాత ఆయన తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్న విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500 లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారని రేవంత్ అన్నారు. Also Read: Mallareddy: మల్లారెడ్డితో పాటు ఆ 12 మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్! వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని చెప్పారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింది. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టినట్లు తెలిపారు. 2025 జనగణనలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేసి.. మోదీని డిమాండ్ చేసాం..దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని రేవంత్ పేర్కొన్నారు. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెస్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారు.ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకో వెళ్లకూడదని అన్నారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్ కు తరిలించుకొని పోయారు.మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి అంటూ రేవంత్ మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. #modi #maharashtra-elections #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి