Uppal: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ! హైదరాబాద్‌లోని ఉప్పలో ఏవీడీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుభ్రం లేకుండా బాత్‌రూమ్ పక్కనే కారం బూందీ, స్వీట్లు ప్యాకింగ్‌కి వేయడం, నాణ్యత లేని పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించి ఫుడ్ సెంటర్‌ను సీజ్ చేశారు. By Kusuma 09 Nov 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఫుడ్ తినాలంటే ఈ రోజుల్లో కాస్త ఆలోచించాలి. అసలు వీరు ఫుడ్ తయారు చేసేటప్పుడు శుభ్రం పాటించరు. దీనివల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి ఫుడ్ సెంటర్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. AVD sweets and kaara company in Uppal, Hyderabad has been raided and seized by GHMC Food Safety officials. The officials found packed food items without expiry date printed on the packages. It was also found unheigenic conditions at the work place. They seized 5533 kgs of food… pic.twitter.com/QOPf0E3UDJ — V Chandramouli (@VChandramouli6) November 9, 2024 ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే? ఈ ఫుడ్ తయారీ చూస్తే.. హైదరాబాద్‌లోని ఉప్పల్ శాంతినగర్‌లో ఉన్న ఏవీడీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్‌లు చేశారు. అక్కడ ఫుడ్ తయారీ చేసే విధానాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. ఫుడ్ తయారు చేసే కిచెన్ అసలు శుభ్రం లేదు. ఇక్కడ స్వీట్స్, కారాం బూందీ వంటి పదార్థాలు తయారు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా? అసలు వీటిని నాణ్యతలేని నాసిరకం పదార్థాలతో తయారు చేస్తున్నారు. దీనికి తోడు బాత్‌రూమ్ పక్కనే వీటిని నేల మీద వేసి తయారు చేస్తున్నారు. దాదాపుగా ఐదున్నర టన్నులు కారం బూందీ, స్వీట్స్‌ను అధికారులు సీజ్ చేశారు. నాణ్యత లేనివి తయారు చేస్తున్నారని ఈ ఫుడ్ కంపెనీని సీజ్ చేశారు. అలాగే ఈ ఫుడ్ కంపెనీకి ఎలాంటి మానుఫ్యాక్చరింగ్ వివరాలు లేవని, ఏవీడీ కంపెనీ ఈ ఫుడ్స్‌ను సప్లై చేస్తుంది. ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక! ఇక్కడ తయారు చేసిన ఏ ఫుడ్ తిన్నా కూడా ఒక్కసారిగా పైకి పోతారని అధికారులు అంటున్నారు. ఎందుకంటే అసలు శుభ్రం లేదు, ఇక్కడ పనిచేసే వాళ్లు కూడా హైజెనిక్ పాటించడం లేదు. ఈ ఫుడ్ కంపెనీపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి శాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టు వచ్చిన బట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్ #hyderabad #avd-food-centre #uppal #Road Side Food Side Effects మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి