Varanasi Release Date: వారణాసి టీమ్ సడెన్ స‌ర్‌ప్రైజ్.. రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేస్తూ ట్వీట్!

మహేశ్ బాబు-రాజమౌళి కాంబో సినిమా ‘వారణాసి’ 2027లోనే విడుదల అవుతుందని టీమ్ మరోసారి ట్వీట్ చేసింది. అయినా అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నారు.

New Update
Varanasi Release Date

Varanasi Release Date

Varanasi Release Date: సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) - దర్శకుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘వారణాసి’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అప్పుడే ఈ చిత్రం 2027లో విడుదల అవుతుందని కూడా చెప్పారు.

Also Read: అడివి శేష్ - మృణాల్ ఠాకూర్ ‘డెకాయిట్’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే..?

Varanasi Movie Team Anounced Release Date 2027

అయితే రాజమౌళి సినిమాలు సాధారణంగా చెప్పిన సమయానికి రిలీజ్ కావు అన్నది ప్రేక్షకులకు తెలిసిందే. అందుకే చాలామంది ఈ సినిమా నిజంగా 2027లో వస్తుందా? అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మరోసారి స్పందించింది.

Also Read: క్రేజీ బజ్.. 'ధురంధర్ 2'కు ఆ హిట్ సినిమాతో లింక్..?

2027లోనే ‘వారణాసి’ రిలీజ్ అవుతుంది అని టీమ్ తాజాగా ట్వీట్ చేసింది. దీంతో మరోసారి స్పష్టత ఇచ్చినట్లయింది. కొందరు అభిమానులు ఈ సినిమాను ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రెండు పండుగలకు ఇంకా ఒక సంవత్సరం సమయం మాత్రమే ఉండటంతో, అంతలోనే సినిమా పూర్తి అవుతుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది.

Also Read: ఏం గుండెరా వాడిది..! ఏనుగును దత్తత తీసుకున్న సూపర్‌స్టార్ శివకార్తికేయన్.

మహేశ్ అభిమానులు, నెటిజన్లలో మాత్రం ఇంకా అనుమానాలే ఉన్నాయి. “2027 రిలీజ్ అంటే నమ్మలేకపోతున్నాం”, "టైమ్ తీసుకొని అయినా సరే లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలి" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, సినిమాలో మహేశ్ బాబు కొద్దిసేపు రాముడి పాత్రలో కూడా కనిపిస్తారని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు.

Also Read: ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ నుంచి దునియా విజయ్ లుక్ రిలీజ్!

ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు