Dhurandhar 2: క్రేజీ బజ్.. ధురంధర్ 2కు ఆ హిట్ సినిమాతో లింక్..?

ధురంధర్ 2లో విక్కీ కౌశల్ URIలోని మేజర్ విహాన్ షెర్గిల్ పాత్రలో ఎక్స్‌టెండెడ్ క్యామియోలో కనిపించే అవకాశం ఉంది. అక్షయ్ ఖన్నా చిన్న ఫ్లాష్‌బ్యాక్ సీన్లలో మాత్రమే ఉంటారని అంచనా, సినిమా 2026 మార్చ్ 19న విడుదల కానుంది.

New Update
Dhurandhar 2

Dhurandhar 2

Dhurandhar 2: రణవీర్ సింగ్(Ranveer Singh) హీరోగా వచ్చిన ధురంధర్ 1 ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ధురంధర్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది.

Also Read: ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ నుంచి దునియా విజయ్ లుక్ రిలీజ్!

Vicky Kaushal in Dhurandhar 2

రిపోర్ట్స్ ప్రకారం, విక్కీ కౌశల్ “URI: ది సర్జికల్ స్ట్రైక్” సినిమాలో తన పాత్ర మేజర్ విహాన్ షెర్గిల్గా ధురంధర్ 2లో ఎక్స్‌టెండెడ్ క్యామియోలో కనిపించే అవకాశం ఉంది.

Also Read: అడివి శేష్ - మృణాల్ ఠాకూర్ ‘డెకాయిట్’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే..?

అక్షయ్ ఖన్నా పాత్ర మాత్రం చిన్న ఫ్లాష్‌బ్యాక్ సీన్లలో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే అతని పాత్ర మొదటి భాగంలో మృతి చెందింది. విక్కీ కౌశల్ క్యామియో నిజమైతే, సీక్వెల్ కు మరింత ఉత్సాహాన్ని, సప్రైజ్ ఫ్యాక్టర్ ను తెస్తుంది.

నిర్మాత ఆదిత్య ధర్, విక్కీతో ముందుగా “URI” లో పని చేశారు. అది భారీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆయనను ధురంధర్ యూనివర్స్లో చేర్చడం ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుంది.

Also Read: ఏం గుండెరా వాడిది..! ఏనుగును దత్తత తీసుకున్న సూపర్‌స్టార్ శివకార్తికేయన్.

అసలు సప్రైజ్ ఏమిటంటే, విక్కీ పాత్ర బిగ్ స్క్రీన్ లో చూడటమే ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. ఆయన 2016లో జరిగిన యుద్ధ నేపథ్యంలో మేజర్ విహాన్ షెర్గిల్ పాత్రను ట్విస్ట్ పెట్టి ప్రవేశపెడతారు. రణవీర్ పాత్రతో ఈ రెండు కథల కలయిక ఎలాగో స్పష్టంగా లేదు, కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని అంచనా. ధురంధర్ 2 త్వరలో టీజర్ రిలీజ్ కానుంది, సినిమా 2026 మార్చ్ 19న భారీ స్థాయిలో విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు