/rtv/media/media_files/2026/01/21/dacoit-movie-2026-01-21-09-38-44.jpg)
Dacoit Movie
Dacoit Movie: తెలుగు-హిందీ ద్విభాషా సినిమాగా రూపొందుతున్న ‘డెకాయిట్’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాతో తొలిసారి అడివి శేష్(Adivi Sesh), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి షనిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/21/dacoit-movie-2026-01-21-09-44-40.jpg)
ఇటీవల మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షూటింగ్ ముగిసిన విషయాన్ని వెల్లడించారు. షూటింగ్ సెట్స్‌లో టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఈ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ పూర్తవడంతో ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లింది. త్వరలోనే ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి.
ఈ సినిమా 2026 మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. అదే రోజున మరో భారీ సినిమా ధురంధర్ 2 కూడా విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండనుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తోంది.
ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో తొలిసారి టాలీవుడ్‌లో నటుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో ‘డాకోయిట్’ పై అంచనాలు మరింత పెరిగాయి.
Follow Us