Duniya Vijay: ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ నుంచి దునియా విజయ్ లుక్ రిలీజ్!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ నుంచి దునియా విజయ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. రఫ్ లుక్‌లో ఆయన పాత్ర ఆసక్తిని పెంచింది. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

New Update
Duniya Vijay

Duniya Vijay

Duniya Vijay: పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’(Slum Dog - 33 Temple Road) సినిమాతో దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) మరోసారి చర్చలోకి వచ్చారు. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే భారీ ఆసక్తిని రేపింది.

ఇప్పుడు ఈ సినిమా నుంచి దునియా విజయ్ కుమార్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయడం విశేషం. ఇందులో దునియా విజయ్ ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నారు.

బ్రౌన్ కలర్ లెదర్ టోపీ, గ్రీన్ స్లీవ్‌లెస్ షర్ట్‌తో పాటు, మెడలో పెద్ద బీడ్స్ గొలుసులు, ప్రత్యేకమైన పెండెంట్‌తో దునియా విజయ్ లుక్ చాలా రఫ్‌గా ఉంది. ఆయన ముఖంలోని ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే, సినిమాలో ఆయన పాత్ర చాలా బలంగా ఉండబోతుందని అర్థమవుతోంది.

పూరి జగన్నాథ్ స్టైల్‌కు తగ్గట్టుగా, ఈ పాత్ర మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ అప్‌డేట్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. పూరి కూడా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తుండగా, సంయుక్త హీరోయిన్‌గా కనిపించనుంది.

ఈ భారీ పాన్ ఇండియా సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, అలాగే జేబీ నారాయణ రావు నిర్మిస్తున్నారు. విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు