/rtv/media/media_files/2025/05/13/bcT4jr0EqYGLTvr7EmEX.jpg)
Pawan Kalyan - OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలలో బిజీ బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను ఓకే చెసిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం పవన్ లైనప్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. అందులో ఓజీ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ పై ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
Pawan Kalyan - OG Update
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
ఇక ఆయన ఏపీ పాలిటిక్స్‌లో బిజీ అవ్వడంతో పవన్ లేని సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇందులో పవన్‌ను ఢీకొట్టే పాత్ర పోషిస్తున్నాడు.
Malli Modhalaindi…. Eeesaari Mugiddaaam… #OG #TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/gvvsS3q2PQ
— DVV Entertainment (@DVVMovies) May 12, 2025
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పవన్ ఫస్ట్ లుక్ టీజర్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అందులో సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మేరకు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభించుకుంది అంటూ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పంచుకున్నారు.
Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!
మూవీ సెట్స్‌లోకి పవన్
ఇందులో భాగంగా మూవీ సెట్లో దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘‘మళ్లీ మొదలైంది.. ఈ సారి కంప్లీట్ చేద్దాం’’ అంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు ఈ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో రాకెట్ స్పీడ్‌లో జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మే 14 లేదా 15న సెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సినీవర్గాల సమాచారం. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
Pawan Kalyan | og | og-movie | OG Movie Shooting | latest-telugu-news | telugu-news