Cinema: హీరో మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు.

New Update
Santhakumari Dies

మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడు, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్(senior-actor-mohanlal) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతకుమారి (90) మంగళవారం (డిసెంబర్ 30) మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు.

Also Read :  ‘జన నాయగన్‌’ ఈవెంట్‌ రికార్డు..

Mohanlal Mother Santhakumari Dies

శాంతకుమారి గత కొన్నేళ్లుగా పక్షవాతం, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతకాలంగా ఆమె మంచానికే పరిమితమయ్యారు. మోహన్ లాల్ తన తల్లిని అత్యంత జాగ్రత్తగా చూసుకునేవారు. ఆమె చికిత్స కోసం తన నివాసంలోనే స్పెషల్‌గా డాక్టర్లను కూడా ఏర్పాటు చేశారు. తల్లి మరణ వార్త తెలిసిన సమయంలో మోహన్ లాల్ కొచ్చిలోనే ఉండటంతో వెంటనే నివాసానికి చేరుకున్నారు. శాంతకుమారి కేరళ ప్రభుత్వ మాజీ లా సెక్రటరీ దివంగత విశ్వనాథన్ నాయర్ భార్య. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్యారీలాల్ 2000 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు.

చిన్న కుమారుడు మోహన్ లాల్ తన తల్లికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. తల్లి శాంతకుమారి నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. మోహన్ లాల్ ఎంతటి స్టార్ డమ్ సంపాదించినా, ఆమె ఎప్పుడూ మీడియా వెలుగులకు దూరంగా ఉండటానికే ఇష్టపడేవారు.

Also Read :  అభిమానుల అత్యుత్సాహం.. కిందపడిన విజయ్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

Advertisment
తాజా కథనాలు