జిమ్‌లో కసరత్తులు, ఈ వయసులోనూ తగ్గేదేలేదంటున్న హీరో మోహన్‌లాల్
మళయాల హీరో మోహన్‌లాల్ టాలీవుడ్లో ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజీ సినిమాలో నటించి అందరిని అబ్బురపరిచాడు. ప్రస్తుతం తన వయస్సు 63 ఏళ్లు. అయితేనేం ఏజ్ తన బాడీకే కానీ తన మనసుకు కాదంటూ ఈ వయసులోనూ తగ్గేదేలే అంటూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నాడు.ఏకంగా 100 కిలోల బరువును ఎత్తి ఫ్యాన్స్‌ని విస్మయానికి గురిచేశాడు.ప్రస్తుతం తాను జిమ్‌లో చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఫిట్‌నెస్‌పై అతనికి ఉన్న డెడికేషన్‌కి అందరూ షాక్ అవుతున్నారు.