/rtv/media/media_files/2025/10/14/meesaala-pilla-2025-10-14-16-25-55.jpg)
Meesaala Pilla
Meesaala Pilla: మెగాస్టార్(megastar-chiranjeevi) - అనిల్ రావిపూడి(Anil Ravipudi) క్రేజీ ప్రాజెక్ట్ మన శంకర వరప్రసాద్ గారు(Mana ShankaraVaraprasad Garu) మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' సాంగ్(Meesaala Pilla Song) విడుదల చేశారు. భీమ్స్ మ్యూజిక్, లెజెండ్రీ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్, భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ తో పాట అదిరిపోయింది. ఇందులో చిరంజీవి, నయనతార విజువల్స్ చాలా బాగున్నాయి. చిరంజీవి నయనతారను టీజ్ చేస్తూ పాడుతున్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ గ్రేస్ స్టెప్పులు, లుక్స్ వింటేజ్ వైబ్స్ గుర్తుచేస్తున్నాయి. విడుదలైన క్షణాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. అరగంట గ్యాప్ లోనే యూట్యూబ్ లో 85వేలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
Also Read : శ్రీలీల షాకింగ్ సర్ప్రైజ్! ఎవరీ 'ఏజెంట్ మిర్చి'..?
Here's our #MeesaalaPilla from #ManaShankaraVaraPrasadGaru 🤗
— Anil Ravipudi (@AnilRavipudi) October 14, 2025
I hope you all enjoy this song as much as we loved creating the Mega Grace of our Megastar @KChiruTweets garu along with #Nayanthara garu ❤️
-- https://t.co/Yhk8fNkG4H
A special mention to my brother…
ఉదిత్ నారాయణ కమ్ బ్యాక్..
లెజెండ్రీ సింగర్ ఉదిత్ నారాయణ చాలా కాలం మళ్ళీ ఈ పాటతో తెలుగులో కమ్ బ్యాక్ ఇస్తున్నారు.ఆయన ఎనర్జిటిక్ వోకల్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తన కెరీర్లో 25 వేలకు పైగా పాటలు పాడిన ఆయన తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అమ్మాయే సన్నగా, రాధే గోవిందా, అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే, తెల్ల తెల్లాని చీర, స్వాతి చినుకా, పడ్డానండీ ప్రేమలో మరీ వంటి పాటలు ఎవర్ గ్రీన్స్ గా నిలిచిపోయాయి.
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్ర 'ఘరానా బుల్లోడు, గ్యాంగ్ స్టార్' సినిమాల తరహాలో ఉండనుంది. ఇందులో చిరంజీవి జోడీగా నయనతార నటిస్తోంది. ఇటీవలే సినిమా నుంచి నయన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో నయన్ శశిరేఖా పాత్రలో నటిస్తున్నారు. సాంప్రదాయ చీరకట్టులో ఆమె లుక్ అదిరిపోయింది.
Also Read : ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!