Kiss Trailer: 'ము.. ము.. ముద్దంటే చేదా..?’ ఇంట్రెస్టింగ్ గా 'కిస్' ట్రైలర్..

కవిన్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘కిస్’ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ప్రేమపై నెగిటివ్ అభిప్రాయంతో ఉన్న యువకుడి జీవితం ‘ప్రీతి’ అనే అమ్మాయి రాకతో ఎలా మారిందన్నదే స్టోరీ. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

New Update
Kiss Trailer

Kiss Trailer

Kiss Trailer: తమిళ యంగ్ హీరో కవిన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు. ‘దాదా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కవిన్, ఈసారి ప్రేమ, కామెడీ, ఫీల్‌గుడ్ ఎమోషన్ల మేళవింపుతో రూపొందిన ‘కిస్’ అనే చిత్రంలో కథానాయకుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇది ఆయనకు దర్శకుడిగా తొలి సినిమా కావడంతో సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది.

సెప్టెంబర్ 19న థియేటర్లలోకి ‘కిస్’

రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ట్రైలర్ చూస్తే, కవిన్ పాత్ర ప్రేమ, ముద్దులకు  దూరంగా ఉండే వ్యక్తిగా కనిపిస్తుంది. గతంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల వల్ల అతడిలో ప్రేమ పట్ల నెగిటివ్ ఏర్పడుతుంది.

అయితే, అతడి జీవితంలోకి ‘ప్రీతి’ అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆమె ద్వారా అతడి జీవితంలో ఏ మార్పులు వస్తాయి? అతడి మనసు ఎలా మారుతుంది? అనేదే ఈ కథ. హీరోలో ఈ మార్పులు కామెడీ, భావోద్వేగాలతో పాటు మంచి ఫీల్‌గుడ్ మూడ్‌ను తెస్తాయని ట్రైలర్ చుస్తే అర్థమవుతోంది.

ట్రైలర్ హైలైట్స్

ట్రైలర్‌లో కవిన్ నటన, అతడి అమాయకపు హావభావాలు, హీరోయిన్‌తో సాగే ఫన్ సన్నివేశాలు యూత్‌ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి తనలోనే ప్రేమను ఎలా కనిపెడతాడు? అన్నదాన్ని వినోదాత్మకంగా చెప్పేందుకు ఈ సినిమా తెరకెక్కించారు.

ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలో కూడా విడుదల కాబోతున్నది. దీంతో కవిన్‌కు పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకూ కేవలం తమిళ ప్రేక్షకులకే పరిచితుడైన కవిన్, ఈ సినిమాతో మరింత మంది అభిమానులను సంపాదించనున్నాడు.

సినిమాలోని పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ పొందాయి. ప్రత్యేకంగా ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ విషయంలోనూ సినిమా క్వాలిటీ కనిపిస్తోంది.

ప్రస్తుతం సినిమా కోసం యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా లవ్, కామెడీ మిక్స్ ఉన్న సినిమాల్ని ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమాను థియేటర్‌లో ఎంజాయ్ చేయనున్నారు. ‘కిస్’ మరో విజయం సాధిస్తే, కవిన్‌కు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ రావడం ఖాయం.

ఈ సినిమా ప్రేమకు ఓ కొత్త అర్థం చెప్పే ప్రయత్నం, కామెడీతో పాటు మంచి సందేశాన్ని అందించనున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

Advertisment
తాజా కథనాలు