Shanmukh Jaswanth: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, పాపులర్ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈరోజు షన్ను పుట్టినరోజు సందర్భంగా తన మొదటి ఫీచర్ ఫిల్మ్ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'ప్రేమకు నమస్కారం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిన్న టైటిల్ గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని గ్లింప్స్ వీడియో చూస్తే అర్థమవుతోంది.
హీరోగా షణ్ముఖ్
గ్లింప్స్ వీడియోలో షణ్ముఖ్ ఎంట్రీ అదిరిపోయింది. నోట్లో సిగరెట్ పెట్టుకొని చాలా స్టైలిష్ అండ్ మాస్ లుక్ లో స్క్రీన్ పై కనిపించారు. బ్రేకప్ అయిన కుర్రాళ్ళ మధ్య జరిగే సంభాషణలతో గ్లింప్స్ సరదాగా సాగింది. తమకు బ్రేకప్ అయిన తీరు, గర్ల్‌ఫ్రెండ్స్ వదిలేయడానికి గల కారణాలను హాస్యభరితంగా చర్చించుకోవడం యువతను ఆకట్టుకుంటోంది. వీరితో పాటు హీరో షణ్ముఖ్ కూడా లవ్ లో ఫెయిల్ అయినట్లు చెప్పడం ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. "నీకు అమ్మాయి దక్కలేదని సిగరెట్లకు, మందుకి ఖర్చు పెట్టే డబ్బుతో కైలాసగిరి దగ్గర ఇల్లు కట్టుకోవచ్చు, కారు కొనొచ్చు" అంటూ షణ్ముఖ్ చెప్పే పంచ్ డైలాగ్స్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అలాగే చివరిలో నీది నాది కాదు "ఇది పాన్-ఇండియా లవ్ ప్రాబ్లమ్" అనే డైలాగ్ హైలైట్ గా అనిపించింది. విడుదలైన గంటల్లోనే గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా కాలం తర్వాత షణ్ముఖ్ ని మళ్ళీ స్క్రీన్ పై చూడడం అతడి ఫ్యాన్స్ ఉత్సాహాన్ని నింపింది. షణ్ముఖ్ కి ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ లో 4 మిలియన్, ఇన్ స్టాగ్రామ్ లో 2.5 మిలియన్ మంది ఇతడిని ఫాలో అవుతున్నారు.
Premaku Namaskaram finally out on Youtube !
— Shanmukh Jaswanth (@shannu_offl) September 16, 2025
Link Bio lo undi ❤️
Thank you so much for Wishes and Love on this special day !!
Taking all the Good Vibes and Feedback for Upcoming Promotions.
Mee Prema ki Vandhanalu 😃❤️#shanmukhjaswanth#Shannu#PremakuNamaskarampic.twitter.com/rXKmPiAeHh
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి వి. భీమ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. AB సినిమాస్ బ్యానర్‌పై అనిల్ కుమార్ రావడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు. ఘని సంగీతం అందిస్తున్నారు. కిషోర్ బోడపు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మరి షణ్ముఖ్ 'ప్రేమకు నమస్కారం' వెండితెరపై ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read: Bigg Boss Promo: ఫుల్ ఫైర్ మీదున్న సుమన్ శెట్టి.. ఈరోజు హౌజ్ లో రచ్చ రచ్చే! ప్రోమో చూశారా