/rtv/media/media_files/2025/09/18/fauji-update-2025-09-18-06-48-12.jpg)
Fauji update
Fauji Update: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులలో 'ఫౌజీ' సినిమా ఒకటి. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈచిత్రానికి సంబంధించిన మరో ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
#Prabhas తో #abhishekbachchan#Kalki2898AD లో తండ్రి.. #Fauji లో కొడుకు#Bollywood లో కథనాలు pic.twitter.com/3lR8CLkCtU
— Tilak Chand (@TilakTalkies) September 17, 2025
అభిషేక్ బచ్చన్
సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలలో నటించడానికి అభిషేక్ అంగీకరించారట. హీరో ప్రభాస్ కి దీటుగా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది. పాత్ర స్వభావం ఏంటి? ఎలా ఉండబోతుంది అనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి ప్రభాస్- అభిషేక్ కాంబినేషన్ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ ని తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ కాంబో నిజమైతే ఫ్యాన్స్ కి పండగే. అంతేకాదు ఈ సినిమతో అభిషేక్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
1940 కాలం నేపథ్యంలో పీరియాడిక్ వార్ డ్రామగా ఫౌజీ చిత్రం రూపొందుతోంది. ఇందులో రెబల్ స్టార్ ఒక భారత సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. నటి ఇమాన్వి ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
దాదాపు రూ.400 వందల కోట్ల ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నట్లు సమాచారం. హను రాఘవపూడి 'సీతారామం' సినిమాకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖరే 'ఫౌజీ ' కూడా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల కానున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మేకర్స్.
ఫౌజీ తో పాటు ప్రభాస్ మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. నాగి డైరెక్షన్ లో కల్కి2898AD పార్ట్ 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ పార్ట్ 2, మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో రాజా సాబ్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తికారగా.. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తారక్ 'డ్రాగన్ ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తికాగనే సలార్ సెట్స్ పైకి వెళ్ళానున్నట్లు తెలుస్తోంది. ఆ లోపు ప్రభాస్ రాజా సాబ్, కల్కి సినిమాలు సినిమాలు పూర్తి చేయనున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే నెల లేదా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.