/rtv/media/media_files/2025/09/18/og-censor-report-2025-09-18-08-19-42.jpg)
OG Censor Report
OG Censor Report: ఈ ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో ‘ఓజీ’ టాప్‌లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది.
ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ ఈ సినిమాలో ఓ కొత్త మాస్, యాక్షన్ అవతారంలో గ్యాంగ్ స్టార్ లుక్స్ లో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఆయన ఎనర్జీ, స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఈ సినిమాలో హై లెవెల్‌లో కనిపించనున్నాయి. అభిమానులు కూడా ఇదే ఊహిస్తూ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఆయనకు తెలుగు ఎంట్రీ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్‌కి మంచి విలన్‌గా ఇమ్రాన్ పాత్ర కచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందని టీమ్ ధీమాగా ఉంది.
ఇక సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బలంగా నిలవబోతుందని సమాచారం. స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఈ సినిమా కి పని చేయడం మరో ప్రత్యేకత.
Also Read:డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. యాక్షన్ సీన్స్, టెక్నికల్ విలువలు, విజువల్స్ అన్నీ టాప్ క్లాస్‌గా ఉండేలా తీర్చిదిద్దారని మేకర్స్ చెబుతున్నారు.
రాత్రి 1 గంటకు ప్రత్యేక షో..
ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉండటంతో, ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 25న రాత్రి 1 గంటకు ప్రత్యేక షోకి టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించారు (జీఎస్టీ సహా). అలాగే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150గా పెంచారు.
ఈ నిర్ణయం మీద చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్లకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.
మొత్తంగా చూస్తే, పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాకుండా యాక్షన్ లవర్స్ అందరికి ‘ఓజీ’ ఒక పవర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్గా రాబోతుంది. మాస్, యాక్షన్, ఎమోషన్ అన్నీ కలిపిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయబోతోంది.