NTR Birthday: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ బర్త్ డేను ఉద్దేశిస్తూ ఎక్స్ చేసిన క్రిప్టిక్ పోస్ట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. తారక్ బర్త్ డే సందర్భంగా ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. హే.. తారక్ ఈ సంవత్సరం మే 20వ తేదీన ఏమి ఆశించాలో మీకు తెలుసా? నమ్ము, మీకు ఏ అంచనాలు ఉండవు. రెడీనా? #War అని పోస్ట్ పెట్టారు.
Also Read : అలేక్య చిట్టి పికిల్స్ సిస్టర్ నటిస్తున్న సినిమా ఇదే.. వీడియోలు చూశారా?
సర్ప్రైజ్లే.. సర్ప్రైజ్లే
ఈ పోస్టుతో తారక్ బర్త్ డే సందర్భంగా మే 20న 'వార్ 2' సినిమాకు సంబంధించి ఏదో ఒక పెద్ద ప్రకటన రాబోతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. 'వార్ 2' టీజర్ లేదా, లేదా ఎన్టీఆర్ గ్లిమ్ప్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ మొదలవుతాయని సమాచారం. అలాగే ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న #NtrNeel ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ కూడా విడుదల కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025
Also Read : ఇట్స్ అఫీషియల్.. వీరమల్లు డేట్ ఫిక్స్ చేశాడు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..
సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'వార్' సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా నటించారు. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ గా నటించారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఇండిపెండెన్స్ సందర్భంగా గా ఆగస్టు 14న హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీగా విడుదల కానుంది.
Hey TIGER NATION Remember Us 😉
— Filmy Tollywood (@FilmyTwoodOffl) May 16, 2025
Follow & Stay Tuned to @FilmyTwoodOffl !! #WAR2 #NTRNeel pic.twitter.com/fWxG0LNQlN
Also Read : జెట్ స్పీడ్ లో మురుగదాస్ ‘మధరాసి'.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read : వాటే ప్లానింగ్..! యశ్ రామాయణలో కాజల్కు దిమ్మతిరిగే రోల్..
telugu-news | cinema-news | telugu-cinema-news | war-2 | war 2 movie updates