OG Movie : ఇమ్రాన్‌ హష్మీ కుమ్మేశాడు. బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు కానీ

సుజీత్ పవన్ కళ్యాణ్‌ను ఒక ఫ్యాన్ బాయ్‌గా చాలా బాగా చూపించారు. ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌ని అద్భుతంగా ప్లాన్ చేశారని అంటున్నారు. అదే విధంగా విలన్ గా నటించిన ఇమ్రాన్‌ హష్మీ కూడా కుమ్మేశాడని చెబుతున్నారు అభిమానులు.

New Update
emran

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ(OG Movie). సుజీత్ డైరెక్షన్(director sujeeth) లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్  ఓజాస్ గంభీర పాత్రలో నటించారు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. తమన్‌ సంగీతం అందించారు. ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంక మోహన్‌, అర్జున్‌ దాస్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్‌, తేజ్‌ సప్రు, హరీశ్‌ ఉత్తమన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, అభిమన్యు సింగ్‌ తదితరులు కీలక పాత్రాలో నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం సినిమా పండగేనని చెబుతున్నారు. 

Also Read :  OG Viral Video: ఇదేం క్రేజ్ రా బాబూ.. 'ఓజీ' థియేటర్లు విజిల్స్ వేస్తూ మెగా హీరోలు రచ్చ రచ్చ! 🔥🔥🔥🔥

బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు కానీ

సుజీత్ పవన్ కళ్యాణ్‌ను ఒక ఫ్యాన్ బాయ్‌గా చాలా బాగా చూపించారు. ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌ని అద్భుతంగా ప్లాన్ చేశారని అంటున్నారు. అదే విధంగా విలన్ గా నటించిన ఇమ్రాన్‌ హష్మీ కూడా కుమ్మేశాడని చెబుతున్నారు అభిమానులు.  ఎంట్రీ నుండి చివరి నిమిషం వరకూ  ఇమ్రాన్‌ హష్మీ(emraan-hashmi) ఓమి క్యారెక్టర్ ఫేస్ లో భయం కానీ బేరుకు కానీ లేకుండా భలే యాక్ట్ చేశాడని, పవన్ కళ్యాణ్ కి ధీటుగా క్రూరమైన క్యారెక్టర్ లో ఇరగదీసాడని కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు కానీ భలే యాక్టర్ ఇమ్రాన్‌ హష్మీ అని కితాబు ఇస్తున్నారు. ఈ సినిమా దెబ్బకు  ఇమ్రాన్‌ హష్మీ రేంజ్ మారిపోవడం ఖాయం అంటున్నారు. ఇమ్రాన్‌ హష్మీ ఎంట్రీ నుంచి ప్రతీ సీన్ లో తమన్ ఇచ్చే హైప్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అని చెబుతున్నారు.  

ఇమ్రాన్ హష్మీ ఎంతటి రొమాంటిక్ వీరుడో ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియకపోవచ్చు కానీ...జలక్ దిక్ లాజా అంటూ ఒకప్పటి కుర్రకారును ఉర్రూతలూగించాడు. ఆయన సినిమాల కంటే.. సాంగ్స్ తెలుగు ఆడియన్స్ ను బాగా కనెక్ట్ అయ్యారు. ఇమ్రాన్ కెరీర్ స్టార్టింగ్ లో బోల్డ్ సీన్లు, రొమాంటిక్ థ్రిల్లర్లతో ఫేమస్ అయ్యాడు. 2004లో విజయ్ భట్ట్ డైరెక్షన్‌లో వచ్చిన మర్డర్' సినిమా అతని కెరీర్‌ నే మార్చి వేసింది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి, ఇమ్రాన్‌కు సెరియల్ కిసర్ అనే ట్యాగ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత యూత్ ఐకానిక్ అండ్ డెప్త్‌గా ఉన్న పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇక ఓజీలో పవన్ స్క్రీన్‌ను రూల్ చేస్తే.. ఇమ్రాన్ అతనికి రియల్ చాలెంజ్ ఇచ్చాడని చెప్పాలి. మొత్తానికి ఇమ్రాన్ హష్మీ  టాలీవుడ్ కు దొరికిన మరో టాలీవుడ్ విలన్.  

Also Read :  గబ్బర్ సింగ్ తరువాత మళ్లీ ఒక్కడచ్చాడు ..  ఊచకోత అంటే ఏంటో చూపించడానికి

Advertisment
తాజా కథనాలు