OG Viral Video: ఇదేం క్రేజ్ రా బాబూ.. 'ఓజీ' థియేటర్లు విజిల్స్ వేస్తూ మెగా హీరోలు రచ్చ రచ్చ! 🔥🔥🔥🔥

పవన్ కళ్యాణ్ మేనల్లుడు, స్టార్ హీరో సాయి ధరమ్ మామ 'ఓజీ' చూస్తూ థియేటర్లు రచ్చ రచ్చ చేశారు. పవన్ ఎంట్రీ సీన్లకు విజిల్స్, అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. 

New Update

OG Viral Video: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ ' ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు,ఎర్లీ  మార్నింగ్ షోలు పడిపోగా సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. సుజిత్ స్క్రీన్ ప్లే, తమన్ బీజీఎం, పవర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తున్నాయి. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై ఇస్తూ అరుపులు పెట్టించాడు డైరెక్టర్. పవన్ ఎంట్రీ సీన్లకు, డైలాగులకు థియేటర్లు   విజిల్స్, అరుపులు, కేకలతో దద్దరిల్లిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ క్రేజ్ ఊపేస్తోంది. అభిమానుల నుంచి సెలబ్రెటీల వరకు పవన్  'ఓజీ' వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన సరైన సినిమా వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. 

సాయి ధరమ్ తేజ్ వీడియో..

పవన్ కళ్యాణ్ మేనల్లుడు, స్టార్ హీరో సాయి ధరమ్ మామ 'ఓజీ' చూస్తూ థియేటర్లు రచ్చ రచ్చ చేశారు. పవన్ ఎంట్రీ సీన్లకు విజిల్స్, అరుపులు, కేకలతో హంగామా  చేశారు. పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ గా 'ఓజీ' ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు హీరో వరుణ్ తేజ్ కూడా థియేటర్లు పేపర్లు విసిరేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సినిమాకథ 

ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్ ను ఏలిన ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్), ఏదో ఒక కారణం వల్ల అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ముంబై లో మళ్ళీ గ్యాంగ్ వార్లు మొదలవుతాయి. దీంతో ఓజస్ మళ్ళీ ముంబైలో అడుగు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత తన శత్రువులైన గ్యాంగ్‌స్టర్‌లతో ఎలా పోరాడాడు ? అసలు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడానికి గల కారణం ఏంటి అనేది సినిమా కథ.

 రోటీన్ రివెంజ్  డ్రామా అయినప్పటికీ.. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, మేకింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సుజీత్. చాలా కాలం తరువాత పవన్ ఫ్యాన్స్ కు   కావాల్సిన మాస్ ఫీస్ట్ అందించాడు. సినిమాలో పవన్  స్టైల్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి.

పవర్ స్టార్ ను ఇంత పవర్ ఫుల్ గా ఇంతకు ముందు ఏ డైరెక్టర్  చూపించలేదనే అంటున్నారు ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ మాస్ ఎలివేషన్స్ , స్క్రీన్ ప్లే తో సినిమాను బాగా నడిపించాడు సుజీత్.

తమన్ బీజీఎం, రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ అదరగొట్టారు. 

Also Read: Pawan Kalyan : గబ్బర్ సింగ్ తరువాత మళ్లీ ఒక్కడచ్చాడు ..  ఊచకోత అంటే ఏంటో చూపించడానికి🔥

Advertisment
తాజా కథనాలు