/rtv/media/media_files/2025/09/25/harish-and-sujeeth-2025-09-25-08-04-11.jpg)
పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు అభిమానులుండరు... భక్తులే ఉంటారని గబ్బర్ సింగ్ ఆడియో పంక్షన్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పిన మాట ఇది. ఓ సగటు పవన్ కల్యాణ్ అభిమానిగా హరీష్ ఈ మాట అన్నారని అర్థం అవుతుంది. వవన్ కల్యాణ్ కెరీర్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో అన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఖుషి తరువాత పవన్ క్రేజ్ వేరు. ఆయన ఇమేజ్ వేరు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎదిగిన హీరో పవన్. ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఐకానిక్ సినిమాలుగా గుర్తుండిడిపోయే సినిమాలు, పవన్ కల్యాణ్ ను ఇలా కదా మేము చూడాలనుకుంది అనుకున్న సినిమాలు మాత్రం వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అందులో గబ్బర్ సింగ్ మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.
Also Read : ఇది ఆరంభం మాత్రమే.. 'ఓజీ' సక్సెస్ వేళ ఫ్యాన్ బాయ్ సుజీత్ పోస్ట్ వైరల్!
సగటు అభిమానిగా పవన్ ను
డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఎంత పెద్ద ఫ్యానో చెపాల్సిన పనిలేదు. పవన్ తో మిరపకాయ్ సినిమా చేయాల్సి ఉంది హరీష్. కానీ అది కుదర్లేదు. ఆ తరువాత పవన్ పిలిచి మరి గబ్బర్ సింగ్ ఆఫర్ ఇచ్చారు. ఇది రీమేక్ సినిమా.. కానీ అసలు సినిమాకు ఈ సినిమాకు చాలా మార్పులు చేశారు హరీష్. సగటు అభిమానిగా పవన్ ను ఎలా చూపించాలో అలా చూపించాడు. ఇందులో పవన్ పోలీస్ అయినప్పటికీ ఎక్కడా క్యాప్ పెట్టుకోడు. పవన్ హైయిర్ స్టైల్ కోసం అలా వాడాడు హరీష్. అంతేకాదు.. ఎక్కడైనా పవన్ హైయిర్ స్టైల్ గాలికి డిస్టబ్ అయితే మళ్లీ సీన్ చేశాడు.. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. దీని రిజల్ట్ ఎంటో అందరికీ తెలుసు.
Also Read : ఈ ఒక్క సీన్ చాలు ఓజీకి.. ఏం తీశావయ్యా సుజీత్.. నీకు ఋణపడిపోతాం!
ఇప్పుడు అలాంటోడే సుజీత్
ఇప్పుడు అలాంటోడే సుజీత్(director sujeeth) కూడా. ఓజీ(OG Movie) సినిమాతో ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ ఫ్యాన్స్ థియేటర్లో ఈ సినిమాకు అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా కదా పవన్ కళ్యాణ్ ను చూపించాలి.. ఇలా కదా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలి.. ఇలా కదా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద సునామీ సృష్టించాలి.. ఇది కదా పవన్ ఫ్యాన్స్ కోరుకునేది.. ఇది కదా ఆయన ఆరా అంటే.. ఇలా కదా పవన్ కళ్యాణ్ క్రేజ్ వాడాల్సింది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ తరువాత మళ్లీ ఒక్కడు ఒచ్చాడు .. ఊచకోత అంటే ఏంటో చూపించడానికి.. వాడు ఒకో ఒకో షాట్ మంటల్లో తీశాడు. నరుకుతుంటే భయమేస్తుంది చూసేవాడికే అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక దశాబ్దం పాటు ఎక్కడ చూసినా ఖుషి సినిమా గురించే మాట్లాడుకున్నారు!మరో దశాబ్దం పాటు గబ్బర్ సింగ్ గురుంచి మాట్లాడుకున్నారు! ఇక చూడండి మరో పదేళ్లు ఎక్కడ చూసినా OG గురించే మాట్లాడుకుంటారని ట్వీట్లు చేస్తున్నారు. సినిమా ఎక్కడా బోర్ లేదు ఒక అభిమాని దర్శకుడు గా చేస్తే ఎలా ఉంటుంది గబ్బర్ సింగ్ చూసాం .. దానికి 10 రెట్లు సుజీత్ తీసి చూపించాడు అని కామెంట్స్ పెడుతున్నారు.