Dinosaur Fossil Auction: డైనోసార్‌ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు

న్యూయార్క్‌లోని సోథిబే సంస్థ ఇటీవల అరుదైన వస్తువులను వేలానికి పెట్టింది. ఇందులో ఈ డైనోసార్‌ శిలాజం ఒకటి. దీనికి వేలం నిర్వహించగా..30.5 మిలియన్‌ డాలర్లు పలికింది. ప్రపంచంలో ఇప్పటివరకు మూడో అత్యంత విలువైన డైనోసార్‌ అస్థిపంజరం ఇది.

New Update
dinosaur fossil

డైనోసార్ అస్థిపంజరం కొన్ని వందల కోట్లు వేలం పలికింది. న్యూయార్క్‌లోని సోథిబే సంస్థ ఇటీవల అరుదైన వస్తువులను వేలానికి పెట్టింది. ఇందులో ఈ డైనోసార్‌ శిలాజం ఒకటి. దీనికి వేలం నిర్వహించగా..30.5 మిలియన్‌ డాలర్లు (రూ.260 కోట్లు) పలికింది. ప్రపంచంలో ఇప్పటివరకు మూడో అత్యంత విలువైన డైనోసార్‌ అస్థిపంజరం ఇది. గతేడాది జులైలో నిర్వహించిన వేలంలో అపెక్స్‌ అనే మరో డైనోసార్‌ శిలాజం 44.6 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.380 కోట్లు) పలికింది. 

Also Read :  జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 20 మంది..

Also Read :  ఐ లవ్ యూ.. అమ్మా అంటూ.. ప్రాణం తీసుకున్న యువకుడు

Dinosaur Fossil Auction

తాజాగా నిర్వహించిన వేలంలో ఆ శిలాజాన్ని ఎవరు కొన్నారన్న విషయాన్ని భద్రతా కారణాల రీత్యా సోథిబే బయటపెట్టలేదు. ఇది 150 మిలియన్‌ సంవత్సరాల క్రితం నాటిదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక, ఇదే వేలంలో అంగారక గ్రహం నుంచి తీసుకొచ్చిన పెద్ద రాయిని కూడా వేలం వేశారు. దాన్ని కొనుగోలు చేసేందుకు కూడా చాలా మంది పోటీపడ్డారు. వేలంలో ఆ రాయి ధర 5.3 మిలియన్‌ డాలర్లు (రూ.45 కోట్లు) పలికింది.

Also Read :  డైనోసార్‌ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు

Also Read :  నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావే కారణం... ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్

Dinosaur fossil | auction | Sotheby auction house

Advertisment
Advertisment
తాజా కథనాలు