IND VS ENG TEST: టీమ్‌ఇండియాకు కొత్త కోచ్.. ఆయన మరెవరో కాదు

ఇంగ్లాండ్‌ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్ కోచ్‌ను మార్చింది. ఇప్పుడున్న సోహమ్ దేశాయ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్‌‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంగ్లాండ్‌లో భారతజట్టుతో కలిశారు.

New Update
Adrian le Roux appointed India strength coach for England Test Series

Adrian le Roux appointed India strength coach for England Test Series

టీమిండియా జట్టు టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఈ నెల 20 (జూన్ 20) నుంచి ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ సారి సిరీస్‌కు టీమిండియా సీనియర్లు లేకపోవడం ఫ్యాన్స్‌ను కాస్త కంగారు పెట్టిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్‌ వంటి స్టార్ ఆటగాళ్లు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు జట్టులో అందరూ కొత్త, యువ ప్లేయర్లే ఉన్నారు. ఇప్పుడు ఈ టెస్టు సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌ సారథ్యం వహించబోతున్నాడు. 

Also Read :  ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి

మొదటి టెస్ట్ జూన్ 20 నుంచి 24 వరకు అవుతుంది. లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో ఇది జరగనుంది. 

రెండో టెస్ట్ జులై2 నుంచి 6 వరకు బర్మింగహామ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. 
మూడో టెస్ట్ జూలై 10 నుంచి 14 వరకు లండన్ లోని లార్డ్స్ లో జరుగుతుంది. 
 
నాలుగో టెస్ట్ జులై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్ లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ లో జరుగుతుంది.

ఐదో టెస్ట్ జులై 31నుంచి ఆగస్టు 4 వరకు లండన్ లోని కోన్నింగ్టన్ ఓవల్ లో అవనున్నాయి

Also Read :  అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు

ఈ తరుణంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్ కోచ్‌ను మార్చింది. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోహమ్ దేశాయ్ ప్లేస్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్‌ (Adrian le Roux)ను ఎంపిక చేసింది. దీంతో అడ్రియన్ లే రౌక్స్‌ ఇంగ్లాండ్‌లో భారత టీంతో కలిశారు. కాగా అడ్రియన్ లే రౌక్స్‌కు ఆటగాళ్ల స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అతడు గతంలోనూ భారత జట్టుకు తన సేవలందించారు. 

టీమిండియా స్క్వాడ్

అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. 

Also Read: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్‌ ఇదే!

ఇంగ్లండ్ స్క్వాడ్

బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాకబ్ బేతెల్, క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జెమీ స్మిత్, శామ్యూల్ జేమ్స్ కుక్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్, జాష్ టంగ్, జెమీ ఓవర్టన్.

 

ind-vs-eng-test-match | ind-vs-eng | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
తాజా కథనాలు