/rtv/media/media_files/2025/06/08/ZtItudXIhWIW0DGTpyz0.jpg)
film chamber president Suniel
ప్రముఖ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. అయితే నిన్ననే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన సునీల్ ఇంతలోనే రాజీనామా సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Jamie Lever: నన్ను చూసి హస్త ప్రయోగం చేసుకున్నాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సునీల్ రాజీనామా
ఈ మేరకు సునీల్ తన రాజీనామా లేఖలో ఇలా రాసుకొచ్చారు.. ''నాకు ఎలాంటి సంబంధం లేని పబ్లిక్ స్టేట్‌మెంట్‌లకు నన్ను బలవంతంగా ముడిపెడుతున్నారు. అందువల్ల నేను ఈ పదవి నుంచి వైదొలగుతున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను'' అని తెలిపారు.
''అలాగే ఈ పరిశ్రమలోని వ్యక్తులకు సంబంధించిన పబ్లిక్ స్టేట్‌మెంట్‌లు/ఇంటర్వ్యూ/ప్రెస్ మీట్‌లు జారీ చేసేముందు ఎవరూ నన్ను సంప్రదించలేదు! నా ప్రమేయం లేని చర్యలు, వ్యాఖ్యలకు నేను ఎలాంటి బాధ్యత వహించను. నాకు అనుమతిలేకుండా చేసిన ప్రకటనలతో నా పేరును ముడిపెట్టడాన్ని నేను అనుమతించలేను. అందువల్ల తక్షణమే నా రాజీనామాను సమర్పిస్తున్నాను'' అని పేర్కొన్నారు.
Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!
Also Read : షర్ట్ బటన్ తీసేసి.. 'టాక్సీ వాలా' బ్యూటీ గ్లామర్ షో! ఫొటోలు చూశారా
🟥NEW SENSE
— NEW SENSE (@Shyamsundarak6) June 8, 2025
.....#Suneil #Narang #resigned...#తెలంగాణ #ఫిల్మ్‌చాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా
పదవికి రాజీనామా చేసిన నిర్మాత #సునీల్ #నారంగ్
కొందరి వ్యాఖ్యలు బాధించాయి
నాకు సమాచారం ఇవ్వకుండా..
కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారు
••••• pic.twitter.com/2PLpfBo70V
ఈ లేఖను తన రాజీనామాకు అధికారిక నోటీసుగా అంగీకరించి.. సంస్థ సజావుగా సాగడానికి మరో తగిన అధ్యక్షుడి నియామకం కోసం అవసరైమైన చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ ని అభ్యర్థిస్తున్నాను అని తెలిపారు. సునీల్ గత మూడు సంవత్సరాల పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు.
Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్
Suniel Narang | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | Telangana Film Chamber