NBK 111 క్రేజీ అప్‌డేట్.. మరోసారి డ్యూయల్ రోల్‌లో బాలయ్య నట విశ్వరూపం..!

బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో NBK 111 అధికారికంగా ప్రారంభమైంది. ముహూర్తం పోస్టర్‌లో బాలయ్య రెండు వేర్వేరు లుక్స్‌తో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. నయనతార హీరోయిన్‌, తమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. షూటింగ్ వివరాలు త్వరలో రానున్నాయి.

New Update
NBK 111

NBK 111

NBK 111:అఖండ 2: తాండవం(Akhanda 2) కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న టైమ్ లో, నందమూరి బాలకృష్ణ చాలా సైలెంట్ గా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. NBK 111 అని పిలుస్తున్న ఈ చిత్రం, బాలయ్యకి సూపర్ హిట్ ఇచ్చిన వీరసింహా రెడ్డి దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనుంది.

Also Read: టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోన్నరేణు దేశాయ్..? లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

Balakrishna NBK 111 Shooting Update

ఈసారి ఇద్దరూ కలసి ఒక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చారిత్రక నేపథ్యమైన సినిమాకు ప్లాన్ చేశారు. పెద్ది సినిమాను నిర్మించిన వృద్ధి సినిమాస్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ముహూర్తం పోస్టర్‌లో బాలయ్యను రెండు వేర్వేరు లుక్స్‌లో చూపించారు. ఆయన మరోసారి డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. - Tollywood news updates

Also Read: NBK 111 క్రేజీ అప్‌డేట్.. మరోసారి డ్యూయల్ రోల్‌లో బాలయ్య నట విశ్వరూపం..!

ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు, కథకు బరువు వచ్చేలా మరికొంతమంది సీనియర్ నటులను కూడా సెలెక్ట్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారు. సంగీతం తమన్ అందించే అవకాశం ఉంది.

Also Read: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి..?

NBK 111 షూటింగ్ వివరాలు చాలా త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. అఖండ 2 విడుదలకు ముందు బాలయ్య ఈ కొత్త సినిమా ప్రారంభం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ భారీ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.

Advertisment
తాజా కథనాలు