/rtv/media/media_files/2025/11/26/renu-desai-2025-11-26-13-00-48.jpg)
Renu Desai
Renu Desai: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్యగా, ఒకప్పుడు ప్రముఖ నటిగా అందరి దృష్టిని ఆకర్షించిన రేణు దేశాయ్ ఇటీవలే ‘టైగర్ నాగేశ్వరరావు’తో సినిమాల్లోకి తిరిగి వచ్చారు. ఆ చిత్రం ఆశించిన స్థాయి ఫలితం సాధించకపోవడంతో, ఆమె మళ్లీ సినిమాలు చేయకపోవచ్చని చాలా మంది భావించారు. అయితే రేణు దేశాయ్ మరో కొత్త సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి..?
Renu Desai Tollywood Re-Entry
Renu Desai Garu attended the opening pooja ceremony of the film #PadhaharuRojulaPandugapic.twitter.com/a5uRTrWNtr
— 𝗔𝗡𝗨𝗣𝗔𝗠𝗔-𝗖𝗨𝗟𝗧 (@MyLifeIsAnupama) November 26, 2025
తాజా సమాచారం ప్రకారం, రేణు దేశాయ్ ‘16 రోజుల పండుగ’ అనే కొత్త చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో డి.ఎస్.రావు కుమారుడు కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. ‘కెరింత’ ఫేం సాయికిరణ్ అడవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. - latest tollywood updates
Also Read: NBK 111 క్రేజీ అప్‌డేట్.. మరోసారి డ్యూయల్ రోల్‌లో బాలయ్య నట విశ్వరూపం..!
ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కుతున్నా, నటీనటుల ఎంపిక మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోంది. రేణు దేశాయ్‌తో పాటు, ప్రముఖ యాంకర్-నటి అనసూయ, నటులు కృష్ణుడు, పార్వతీశం, భావన, సత్య కృష్ణ వంటి వారు కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారని సమాచారం.
‘16 రోజుల పండుగ’ షూటింగ్ ప్రారంభ కార్యక్రమం ఇవాళనే జరగనుండగా, రేణు దేశాయ్ కూడా ఈ లాంచ్ ఈవెంట్‌కి హాజరవుతారన్న టాక్ ఉంది. వివరాలు ఈ ఈవెంట్ తరువాత వెలువడే అవకాశం ఉంది.
Also Read: టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోన్నరేణు దేశాయ్..? లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!
మొత్తం మీద, రేణు దేశాయ్ మరోసారి టాలీవుడ్‌లో కొత్త పాత్రను అంగీకరించడం చూస్తే ఆమె రీ-ఎంట్రీ నిజంగానే సీరియస్‌గా జరుగుతోందని తెలుస్తోంది. అభిమానులు కూడా ఆమెను మరిన్ని మంచి పాత్రల్లో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Follow Us