Allu Arjun: అల్లు అర్జున్ ఎవరి అభిమానో తెలుసా.. సక్సెస్ మీట్లో బన్నీ సంచలన స్టేట్మెంట్!

లక్షల మందికి అభిమాన హీరో అయిన అల్లు అర్జున్.. తన డైరెక్టర్ సుకుమార్ కి అభిమాని అయ్యారట. తనకు సుకుమార్ కేవలం ఒక వ్యక్తి కాదని, అతను ఒక భావోద్వేగమని అన్నారు. సుకుమార్ కి తాను పెద్ద అభిమానిని అంటూ డైరెక్టర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు."

New Update
allu arjun fan

allu arjun

Allu Arjun:  స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు.. గంగోత్రి నుంచి  'పుష్ప'(Pushpa) వరకు ఇలా తన నటనలో, పాత్రల్లో వైవిధ్యాన్ని కనబరుస్తూ.. సినీ లోకమంతా తన పేరును చెప్పుకునే స్థాయికి వెళ్లారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప' తో  తగ్గేదెలే అంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ  పుష్పరాజ్ కి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు.  ఏ హీరోకు లేని విధంగా  ఫ్యాన్స్ ఆర్మీనే(Allu Arjun Army) ఉంది. ఇలా కోట్ల మందికి అభిమాన హీరో అయిన అల్లు అర్జున్..  తన డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) కి అభిమాని అయ్యారట. తాను గొప్ప నటుడు అవ్వడానికి  సుకుమారే కారణమని కొనియాడారు. 

Also Read:  కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!

sukumar photo

Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి

సుకుమార్ కి నేను పెద్ద అభిమానిని

ఇటీవలే  'పుష్ప2'  థాంక్యూ మీట్(Pushpa 2 Thank You Meet) లో పాల్గొన్న  హీరో అల్లు అర్జున్ తన దర్శకుడు సుకుమార్ పై ప్రశంసలు కురిపించారు. "సుకుమార్ నా నటనను ఇష్టపడడం వల్లే నేను ఇంత బాగా నటించగలిగానని. సరైన మార్గనిర్దేశం లేకుంటే.. ఎంత గొప్ప స్టార్‌ అయినా కూడా  మంచి నటుడు కాలేడు. నన్ను గైడ్‌ చేసినందుకు థ్యాంక్స్‌. నాకు సుకుమార్ కేవలం ఒక వ్యక్తి కాదు, అతను ఒక భావోద్వేగం. సుకుమార్ కి నేను పెద్ద అభిమానిని అంటూ డైరెక్టర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు."

Also Read: This Week Ott Movies:  వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే!

bunny with sukumar

అలాగే బన్నీ ఇంకా మాట్లాడుతూ.. మేము ఈరోజు గర్వంగా నిలబడే అవకాశం ఇచ్చినందుకు తెలుగు పరిశ్రమ తరపున ధన్యవాదాలు. దర్శకుడు అంటే ప్రేక్షకులతో నేరుగా మాట్లాడే వ్యక్తి. నటీనటులు సరిగా చేయకపోయినా దర్శకత్వం బాగుంటే, ఆ సినిమా కచ్చితంగా ఆడుతుంది. కాబట్టి సినిమా క్రెడిట్ మొత్తం  సుకుమార్ కే  ఇవ్వాలి అని అన్నారు. 

Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు