Jaabilamma Neeku Antha Kopama Trailer
'జాబిలమ్మ నీకు అంత కోపమా' ట్రైలర్
ధనుష్ దర్శకత్వం వహించిన లాటెస్ట్ మూవీ 'నిలవుక్కు ఎన్ మేల్ ఎనది కోపం'. తెలుగులో ఈ చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా' పేరుతో ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. చేతిలో మందు గ్లాస్ తో 'ఇది చాలా యూజువల్ స్టోరీనే అండి' అంటూ ధనుష్ డైలాగ్స్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇద్దరు ప్రేమ జంటలు, వారి ప్రేమ కథ, బ్రేకప్.. ఆ తర్వాత ఒకరు ప్రేమించిన వారిని మరొకరు పెళ్లి చేసుకోవడం వంటి అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. చివరిలో 'జాలీగా రండి.. జాలీగా వెళ్ళండి' అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ మరింత ఆకట్టుకుంటోంది.
#NEEK trailer https://t.co/QiXPdHqFRe #DD3 ❤️❤️❤️
— Dhanush (@dhanushkraja) February 10, 2025
ఇందులో పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖడూన్, రమ్య రంగనాథన్, సిద్ధార్థ్ శంకర్త దితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈమూవీలో ధనుష్ క్యామియో రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కస్తూరి రాజా , విజయలక్ష్మి కస్తూరి రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఇది ఇలా ఉంటే ధనుష్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో 'ఇడ్లీ కడై' అంటూ మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: This Week Ott Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే!