This Week Ott Movies:  వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే!

ఈ వారం ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు సందడి చేయబోతున్నారు. డాకూ మహారాజ్, తమిళ్ ఫిల్మ్ కాదలిక నేరమిల్లా, మార్కో, బాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధూమ్ ధామ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

New Update
ott movies

ott movies

This Week Ott Movies:  ఓ వైపు వాలెంటైన్ వీక్ తో ప్రేమికులు బిజీగా ఉండగా.. మరోవైపు సినీ ప్రియులు తమ ప్రియమైన వారితో వీక్షించేందుకు పలు సినిమాలు, సీరీస్ లు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. బాలయ్య డాకూ మహారాజ్ నుంచి ధూమ్ ధామ్ వంటి బాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమాల వరకు అనేక సినిమాలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 ప్లాట్ ఫార్మ్స్ లో సందడి చేయబోతున్నాయి. 

కాదలిక నేరమిల్లా 

జయం రవి, నిత్యా మీనన్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ్ ఫిల్మ్  'కాదలిక నేరమిల్లా'.  ఈ చిత్రం  ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో  స్ట్రీమింగ్ కానుంది.  తన ఇంటి ఓనర్ కూతురిని ప్రేమించిన ఒక కుర్రాడు  ఆమెను పెళ్లి చేసుకోవడానికి పడే తిప్పలే ఈ సినిమా కథ. 

మార్కో 

ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో నటించిన  'మార్కో' చిత్రం ఫిబ్రవరి 14 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి రానుంది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇందులో కబీర్ దుహన్ సింగ్, యుక్తి తరేజా, జగదీష్, రియాజ్ ఖాన్,  అన్సన్ పాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

డాకూ మహారాజ్

బాలయ్య - డైరెక్టర్ బాబీ కాంబోలో సంక్రాంతికి విడుదలైన  'డాకూ మహారాజ్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 అంటే నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

ధూమ్ ధామ్

యామీ గౌతమ్, ప్రతీక్ గాంధీ, పవిత్ర సర్కార్, ఈజాజ్ ఖాన్,  సాహిల్ గంగుర్డే కీలక పాత్రలు పోషించిన యాక్షన్ ఎంటర్ టైనర్  'ధూమ్ ధామ్' ఫిబ్రవరి 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

గేమ్ ఛేంజర్: ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 

బేబీ జాన్: అమెజాన్ ప్రైమ్ వీడియో 

Also Read: Kannappa Movie: మంచు విష్ణు కన్నప్ప నుంచి 'శివ శివ శంకర' సాంగ్ లోడింగ్..! గ్లింప్స్ ఇక్కడ చూసేయండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు