/rtv/media/media_files/2025/07/08/phone-shaped-slab-2025-07-08-20-44-57.jpg)
phone-shaped slab
Phone Shaped Slab: ఈరోజుల్లో మనందరం ఫోన్‌కు ఎంతగా అడిక్ట్ అయిపోయామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో లేకపోతే ఏదో వెలితి అనే ఫీలింగ్ లో ఉండిపోతున్నాము. కానీ, దీని వల్ల మన ఆరోగ్యంపై, మన సంబంధాలపై చాలా చెడు ప్రభావం పడుతుంది. నిద్ర సరిగ్గా పట్టకపోవడం(Inadequate Sleep), కళ్ళు మంటలు పుట్టడం(Burning Eyes), ఇంట్లో వాళ్లతో మాట్లాడటం తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా, ఒక కొత్త ఆలోచన ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అదే 'ది ఫోన్ షేప్డ్ స్లాబ్' (The Phone Shaped Slab). ఇది సరిగ్గా మన స్మార్ట్‌ఫోన్ ఆకారంలో ఉండే ఒక యాక్రిలిక్ స్లాబ్. దీనికి స్క్రీన్ ఉండదు, సిమ్‌కార్డు ఉండదు, ఏ నోటిఫికేషన్లూ రావు.
Also Read : బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం...కొత్త జీవో వైపు అడుగులు
'ది ఫోన్ షేప్డ్ స్లాబ్'
గూగుల్, ఫేస్‌బుక్ వంటి పెద్ద సంస్థల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఎరిక్ ఆంటోనోవ్ అనే వ్యక్తి ఈ స్మార్ట్‌ఫోన్ ఆకారపు ''యాక్రిలిక్ స్లాబ్'' సృష్టించారు. దీన్ని కేవలం ఒక ఆసక్తికరమైన కళా ప్రాజెక్ట్‌గానే కాకుండా, ఫోన్ వ్యసనాన్ని తగ్గించడానికి మానసిక సాధనంగా కూడా ఆయన రూపొందించారు. ఎరిక్ తన స్నేహితులకు ఈ స్లాబ్‌ల నమూనాలను పంపినప్పుడు, టిక్‌టాక్ క్రియేటర్ కేథరిన్ గోట్జే చేసిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో మొదట తయారు చేసిన 100 స్లాబ్‌లు త్వరగా అమ్ముడైపోయాయి. ప్రస్తుతానికి ఇది భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో లేదు.
Also Read : మెగా డాటర్ న్యూ లుక్ అదిరింది! ఫొటోలు చూశారా
ఎందుకు ఈ 'ది ఫోన్ షేప్డ్ స్లాబ్' (The Phone Shaped Slab)
మన మెదడు ఫోన్‌ను తరచుగా చేతిలోకి తీసుకోవడానికి, దాన్ని చూడటానికి అలవాటు పడిపోయింది. ఈ అలవాటు చాలా మందికి ఒక వ్యసనం లాగా తయారైంది. ఏదో తెలియని ఒత్తిడి, బోర్ కొట్టినప్పుడు, లేక ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుంటాం.
ఇలాంటి పరిస్థితిలో 'ది ఫోన్ షేప్డ్ స్లాబ్' ఈ అలవాటును మార్చడానికి ఒక "ట్రిక్" లాగా పనిచేస్తుంది. మీకు ఫోన్ చూడాలనిపించినప్పుడు, దాని బదులు ఈ చెక్క ముక్కను చేతిలోకి తీసుకోండి. దీని వల్ల ఫోన్‌ను పట్టుకున్న సంతృప్తి కలుగుతుంది. కానీ మీరు ఆన్‌లైన్ ప్రపంచంలోకి వెళ్లరు. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే అనవసరమైన సమాచారం, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అన్నీ మీకు దూరం అవుతాయి.
Also Read : యుగాంతం ఎఫెక్ట్.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు
ఎలా సహాయపడుతుంది?
ఈ చెక్క ముక్క మన దృష్టిని ఫోన్ నుంచి నిజమైన ప్రపంచం వైపు మళ్లిస్తుంది. మీరు ఈ స్లాబ్‌ను పట్టుకొని ఉండగా, మీ మెదడుకు వేరే పనులు చేయమని సంకేతాలు అందుతాయి. అప్పుడు మీరు పుస్తకాలు చదవడం, బయట నడవడం, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి మంచి పనులు చేయవచ్చు. ఇది క్రమంగా ఫోన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
మానసిక నిపుణులు ఏమంటున్నారు?
గురుగ్రామ్‌లోని గేట్‌వే ఆఫ్ హీలింగ్ వ్యవస్థాపకురాలు, సైకోథెరపిస్ట్ డాక్టర్ చాందిని తుగ్నైట్ దీని గురించి మాట్లాడుతూ, "'మెథాఫోన్' (ఈ స్లాబ్‌ను వారు పిలిచే పేరు) ఒక ఆసక్తికరమైన ఆలోచన. ఎందుకంటే ఇది ఫోన్ వాడాలనే కోరికను నేరుగా ఆపడానికి ప్రయత్నించదు, బదులుగా దానిని మళ్లించడానికి ప్రయత్నిస్తుంది. చాలా రకాలుగా ఇది తెలివైన పద్ధతి అని అన్నారు.
అలాగే ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లోని ఎంపోవర్‌లో పనిచేస్తున్న మనస్తత్వవేత్త రుతుజా వాలావల్కర్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయం పంచుకున్నారు. ఫోన్ లేకుండా చేతిలో ఏదో లేనట్లుగా, ఆందోళనగా లేదా అసౌకర్యంగా భావించే వారికి ఈ కాన్సెప్ట్ బొమ్మ (స్లాబ్) ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె చెప్పారు.
Also Read:Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు
life-style | telugu-news | Digital Detox Tool