/rtv/media/media_files/2025/10/03/kajol-durga-puja-video-viral-2025-10-03-15-03-41.jpg)
Kajol Durga Puja Video Viral
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(ajay-devagan) భార్య, హీరోయిన్ కాజోల్ దేవగన్(Kajol Devgan) కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె దసరా ఉత్సవాల్లో భాగంగా ముంబైలోని ఓ పండల్‌లో పాల్గొనగా.. ఓ వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై చేయవేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అతడు ఎవరు? ఎందుకు చేయి వేశాడు? అనే విషయానికొస్తే..
Also Read : బీచ్‌లో సమంత బికినీ ఫొటోలు.. పిక్స్ వైరల్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!
Kajol Durga Puja Video Viral
నటి కాజోల్ కుటుంబం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విజయదశమి(Vijayadasami 2025) రోజున తన ఫ్యామిలీతో కలిసి దుర్గా పూజా మండపానికి వెళ్లారు. అక్కడ అంగరంగ వైభంగా దుర్గామాతకు పూజలు చేశారు. సంప్రదాయ చీర కట్టుకుని, నుదుటున సింధూరం పెట్టుకుని ఆమె పూజలో పాల్గొన్నారు. అలా దేవీ దుర్గామాత దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆమె పూజలు ముగించుకుని పండల్ మెట్లు దిగుతుండగా.. ఒక వ్యక్తి ఆమె ఛాతిపై తాకాడు.
एक्ट्रेस काजोल का एक वीडियो इंटरनेट पर बहुत वायरल है।
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) October 3, 2025
मुंबई के सर्बोजनिन दुर्गा पंडाल में कल बॉलीवुड कलाकारों का जमावड़ा लगा था। काजोल भी वहां मौजूद थी। एक हाथ किसी का आता है उनकी तरफ और चेहरे का एक्सप्रेशन बताता है कुछ गलत हुआ।#Kajol#DurgaPandal#ViralVideo#BollywoodBuzz… pic.twitter.com/lbwkou5BpJ
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వీడియోలో కాజోల్ మెట్లు దిగుతుండగా అక్కడే ఉన్న ఒక వ్యక్తి పైకి వెళ్తున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత అతడు కాజోల్ చేయి పట్టుకుని పైకి లాగాడు. అది కాస్త ఆమె ఛాతిని తాకినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఊహించని పరిణామంతో కాజోల్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసి, కోపంగా వెనక్కి తిరిగి ఆ వ్యక్తి వైపు చూసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఆ తర్వాత కాజోల్ మళ్లీ పైకి వెళ్లి ఆ వ్యక్తితో కలిసి సెల్ఫీ దిగినట్లు వీడియోలో కనిపించింది.
దీనిపై నెటిజన్లు, అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి కావాలనే అసభ్యంగా తాకాడని విమర్శిస్తూ కొందరు అభిమానులు మండిపడుతున్నారు. సెలబ్రెటీల ప్రైవసీకి భంగం కలగడం అత్యంత దురదృష్టకరమని చెప్పుకొస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇది కేవలం రద్దీలో భాగంగా పొరపాటున మాత్రమే జరిగి ఉంటుందని సమర్థిస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read : ఐశ్వర్య సంచలన నిర్ణయం... యూట్యూబ్ పై రూ.4 కోట్ల పరువునష్టం దావా