Akhil Lenin Update: ‘లెనిన్’ క్రేజీ రూమర్: అయ్యగారి కోసం బడా బాలీవుడ్ హీరో ఎంట్రీ..!

అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాలో ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించినట్టు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అయితే ఆ హీరో పేరును ఇంకా వెల్లడించలేదు, త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశముంది.

New Update

Akhil Lenin Update: అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కొత్త మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నారు. 'లెనిన్' టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ మేజర్ అప్ డేట్ వైరల్ గా మారింది.

Also Read: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!

బాలీవుడ్‌ సీనియర్ హీరో గెస్ట్ రోల్ 

తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే, ఈ సినిమాలో ఓ ప్రత్యేక అతిథి పాత్ర ఉందట.అయితే, ఆ గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ హీరోను సంప్రదించారట. అయితే ఆయన పేరు మాత్రం ఇంకా బయటకు రాలేదు. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

ఈ సినిమా  రాయలసీమ ప్రాంతానికి సంబంధించినదిగా రూపొందుతోంది. ముఖ్యంగా చిత్తూరు ప్రాంతాన్ని బేస్‌గా తీసుకుని స్క్రిప్ట్‌ను రూపొందించినట్టు సమాచారం. అఖిల్ పాత్రలో నేటివిటీని హైలైట్ చేయడం కోసం, అతని డైలాగ్ డెలివరీలో కూడా చిత్తూరు యాసలో  స్పష్టంగా ఉంటుందట.

Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

ఈ చిత్రంలో అఖిల్ సరసన గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుందని చిత్రబృందం చెబుతోంది. ప్రత్యేకంగా లవ్ ట్రాక్‌కు మ్యూజిక్, విజువల్స్ అంతా హై క్వాలిటీగా ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే, ఈ సినిమాను 2025 నవంబర్ 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్లాన్ ప్రకారమే జరుపుతున్నారు.

Also Read: 'పెద్ది' అంతకు మించి..! ఇక రికార్డులు గల్లంతే..

మొత్తానికి అఖిల్ కొత్త లుక్, రాయలసీమ మాస్ ఫ్లేవర్, శ్రీలీల కెమిస్ట్రీ, బాలీవుడ్ సీనియర్ హీరో స్పెషల్ అప్పియరెన్స్ ఇలా అన్ని కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. మరి అఖిల్ 'లెనిన్' తో అయినా హిట్ కొడతాడేమో చూడాలి!

Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

 

tollywood-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు