Peddi Movie Update: 'పెద్ది' అంతకు మించి..! ఇక రికార్డులు గల్లంతే..

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా 30% షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇటీవల లండన్‌లో చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమా ‘రంగస్థలం’ కన్నా గొప్పగా ఉండబోతుందని తెలిపారు. గ్రామీణ క్రీడల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి.

New Update

Peddi Movie Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ లో  భారీ ఆసక్తిని రేకెత్తించింది. గ్రామీణ క్రీడల నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా, చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.

Also Read:ఎన్టీఆర్ సరసన 'సాహో' బ్యూటీ..!

‘రంగస్థలం’ కంటే బెటర్‌గా 'పెద్ది': రామ్ చరణ్

ఇటీవల లండన్‌కి వెళ్లిన రామ్ చరణ్ అక్కడ తన మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా షేర్ చేశారు. ఇప్పటివరకు సినిమా షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయిందని ఆయన తెలిపారు. అలాగే, “ఈ సినిమా ‘రంగస్థలం’ కంటే కూడా ఇంకా బెటర్‌గా ఉండబోతుంది,” అంటూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

Also Read:'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

ఈ సినిమా కథ నేటివిటీకి  దగ్గరగా ఉండేలా, గ్రామీణ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ లుక్, పాత్ర ప్రత్యేకంగా ఉండనుంది. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుండగా, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడం ఈ ప్రాజెక్ట్‌పై హైప్‌ను మరింత పెంచేసింది.

Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా విజువల్స్‌, బిజీఎం  స్క్రీన్‌ప్లే, సూపర్ సౌండ్‌ట్రాక్‌కి తోడు, చరణ్ యాక్టింగ్ కూడా కొత్తగా కనిపించేలా దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

మొత్తానికి, 'పెద్ది' సినిమా క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ‘రంగస్థలం’ని మించేలా ఈ  ప్రాజెక్ట్‌ ఉండబోతుందని చరణ్ మాటల ద్వారా ఫ్యాన్స్ అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Advertisment
తాజా కథనాలు