Akhanda 2 Update: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా, అఖండలో ఉన్న త్రిశూలాన్ని కొత్తగా మైథాలజీ టచ్‌తో డిజైన్ చేస్తున్నారని తాజా సమాచారం.

New Update

Akhanda 2 Update: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ లో పీక్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఇక ఈ పవర్‌పుల్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సీక్వెల్ ‘అఖండ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీమ్ గట్టిగా శ్రమిస్తోంది.

Also Read: 'పెద్ది' అంతకు మించి..! ఇక రికార్డులు గల్లంతే..

అయితే ఈ సినిమా గురించి తాజా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ - బోయపాటి చిత్రాల్లో ఆయుధాలకు ఉండే స్పెషలిటీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో కనిపించే ఆయుధాల డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

పవర్‌ఫుల్ వెపన్

ముఖ్యంగా ‘అఖండ’ ఫస్ట్ పార్ట్‌లో బాలయ్య అఘోర గెటప్ లోని త్రిశూలం చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు, ఆ మాజికల్ వెపన్ ని మరింత పవర్‌ఫుల్ వెర్షన్ లోకి మార్చి ‘అఖండ 2’ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ కొత్త ఆయుధం డిజైన్ లో మైథాలజికల్ టచ్ ఉంటుందట, ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించాలని బోయపాటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్.

Also Read: ఎన్టీఆర్ సరసన 'సాహో' బ్యూటీ..!

ఈ పవర్‌ఫుల్ వెపన్‌ చేతపట్టి  అఘోర వేషంలో బాలయ్య మళ్లీ ఎలా మెరుస్తారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పుడు మొదలైంది. కొత్త ఆయుధంతో పాటు, బాలయ్య లుక్‌, డైలాగ్స్‌, యాక్షన్ స్క్రీన్స్ అన్నీ ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

మొత్తానికి, 'అఖండ 2' మేకింగ్‌ అప్ డేట్స్ ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. ఏదేమైనప్పటికీ ఈ సారి అఖండ 2 లో బాలయ్య కొత్త ఆయుధం చుస్తే థియేటర్లలో నందమూరి ఫ్యాన్స్​కు పూనకాలే! 

Advertisment
Advertisment
తాజా కథనాలు