Single Movie Collections: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

శ్రీ విష్ణు 'సింగిల్' సినిమా విడుదలైనప్పటి నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడవ రోజు(ఆదివారం) ఒక్కరోజే రూ. 5.1 కోట్లు రాబట్టింది, ఇప్పటివరకు మొత్తం రూ. 16.3 కోట్ల వసూళ్లు సాధించి. నాన్ వీక్ ఎండ్స్‌లో కూడా జోరు కొనసాగిస్తోంది.

New Update

Single Movie Collections: హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన తాజా లవ్ ఎంటర్టైనర్ ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, రోజురోజుకూ వసూళ్లు పెరుగుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్ల వద్ద మంచి ఓపెనింగ్స్‌ రాబడుతోంది.

Also Read: ఎన్టీఆర్ సరసన 'సాహో' బ్యూటీ..!

ఇప్పటికే వికెండ్‌ కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సింగిల్ మూవీ, మూడవ రోజు ఆకట్టుకునే విధంగా కలెక్షన్స్ రాబట్టింది. ఆదివారం ఒక్కరోజే రూ. 5.1 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. మొత్తం మీద ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.నాన్ వీక్ ఎండ్స్ లో కూడా ఈ సినిమా జోరు తగ్గడం లేదు.

Also Read:'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

24 గంటల్లో 66 వేలకుపైగా టిక్కెట్లు బుక్

ఈ సినిమాకి ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చుస్తే  బుక్‌మైషోలో  24 గంటల్లో 66 వేలకుపైగా టిక్కెట్లు బుక్ అయ్యి శ్రీ విష్ణు కెరీర్ లో ఒక రికార్డు సెట్ చేసింది. ఇప్పటివరకు 2 లక్షల టిక్కెట్లు పైనే బుక్ అయినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. యూఎస్‌లో ఇప్పటికే $400K దాటి, హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే వారం రోజుల్లో మరింత వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

ఈ మూవీకి  వెన్నెల కిషోర్ పాత్ర మేజర్ ప్లస్ పాయింట్ కాగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం కి మంచి మార్కులు పడ్డాయి. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను  విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్‌, రియాజ్‌ చౌదరి కలిసి నిర్మించారు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పణ అందించారు.

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

Advertisment
తాజా కథనాలు