/rtv/media/media_files/2025/11/14/thaandavam-lyrical-video-released-2025-11-14-17-50-32.jpg)
Thaandavam Lyrical Video released
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అఖండ 2:(akhanda-2-movie) తాండవం’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఫుల్ హైప్‌తో రూపొందుతోంది. గతంలో వచ్చిన ‘అఖండ’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Also Read : సినీ ఇండస్ట్రీలో విషాదం.. మరో నటి కన్నుమూత
Akhanda 2 Thaandavam
Also Read : ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!
ఇప్పుడు మరో అప్డేట్‌తో మేకర్స్ అదరగొట్టేశారు. ఇటీవలే ఈ మూవీ నుంచి ‘తాండవం’ అంటూ సాగే ప్రోమోను రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘అఖండా తాండవం’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఈ పాటలో బాలకృష్ణ అవతారం ఆడియన్స్‌ను మంత్ర ముగ్దులను చేసింది. ఒంటి నిండా విభూది, మెడలో రుద్రాక్షలు, చేతిలో బళ్లెం ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా థమన్ ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. మొత్తంగా ఈ మాస్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలయ్య బాబు అఖండ పాత్రలో రెండు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
Follow Us