/rtv/media/media_files/2025/11/14/gopi-galla-goa-trip-2025-11-14-16-04-05.jpg)
Gopi Galla Goa Trip
కొన్ని సినిమాల కథలు రొటీనే అయినా.. టేకింగ్, మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటాయి. అలాంటి ఒక సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ఆ సినిమా పేరే ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’. ఈ చిత్రం రోహిత్ & శశి దర్శకత్వంలో మంచి అంచనాలతో రూపొందింది. ఔరా ఉలిస్ ఆర్ట్స్, రాస్తా ఫిల్మ్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా బ్యానర్లపై సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మొదటి నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇవాళ అంటే నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ అయింది.
Gopi Galla Goa Trip
స్టోరీ: ఈ మూవీ స్టోరీ లైనప్ చాలా చిన్నది. తెలంగాణలోని గద్వాల్ జిల్లా రిమోట్ విలేజ్‌కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు పేర్లు గోపీ. వీరు టెంట్ సామాను షాప్ నడుపుతుంటారు. వారు లైఫ్‌లో ఒక్కసారి అయినా గోవా వెళ్లాలనుకుంటారు. వారు అనుకున్నట్లుగానే గోవా వెళ్లారు. ఇలా గోవా వెళ్లే క్రమంలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?.. మార్గ మధ్యలో వారికి పరిచయం అయిన మరో గోపీ ఎవరు?.. గోవా వెళ్లిన ఇద్దరు గోపీలు వారు అనుకున్న పని చేయగలిగారా?.. అక్కడ పని అయిపోయాక తిరిగి సొంతూరుకి చేరుకున్నారా? లేదా? అనేది అసలైన కథ. ఇది తెలియాలంటే థియేటర్లలో మూవీని వీక్షించాల్సిందే.
విశ్లేషణ : ఇదొక రోడ్ ట్రావెల్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కథ చాలా రొటీన్. ఒకే లైన్‌లో చెప్పుకునే స్టోరీ. అయితే సినిమా చూసినంత సేపు మనం చూసేది రొటీన్ స్టోరీనే అనిపించినా.. టేకింగ్ మేకింగ్ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది. తరచూ చూసే రోటీన్ స్టోరీల కంటే ఇది కాస్త రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇది దాదాపు ఇంగ్లిష్ సినిమాల మాదిరి ఫ్రెష్ టేకింగ్‌తో వచ్చింది. ఈ మూవీలో హైలైట్ సీన్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. కామెడీ టైమింగ్స్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్‌గా ఫినిస్ చేసేశారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్‌గా డెప్త్‌గా చూపించారు. షార్ట్ మేకింగ్‌లో షార్ట్ డివిజన్.. ఇలా ప్రతి విషయంలో దర్శకుడి డైరెక్షన్ కనిపించింది.
ఎవరెలా చేశారు : అజిత్ మోహన్, క్యాంప్ శశి, రాజు శివరాత్రి, మోనిక బుసం, పవోన్ రమేష్, సాయి కుమార్ బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఉండేది తక్కువ క్యారెక్టర్సే అయినా ఎవరి ప్రాధాన్యత వారికిచ్చారు. ప్రతి ఒక్కరు వారి వారి పాత్రలో బాగా నటించారు. ఈ చిత్రానికి రవి నిడమర్తి అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తంగా ఈ మూవీ ప్రతి ఒక్క ఆడియన్‌కు బాగా నచ్చుతుంది.
Follow Us