Kamini Kaushal Died: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మరో నటి కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటి కామిని కౌశల్ 98 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. చివరిగా ఆమె మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో కామిని కౌశల్ మరణం మొత్తం పరిశ్రమలో శోకసంద్రాన్ని నింపింది.

New Update
Kamini Kaushal Died

Kamini Kaushal Died

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రఖ్యాత, ప్రముఖ బాలీవుడ్ నటి కామిని కౌశల్ 98 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. చివరిగా ఆమె మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో కామిని కౌశల్ మరణం మొత్తం పరిశ్రమలో శోకసంద్రాన్ని నింపింది. కౌశల్ మరణం ఆమె అభిమానులను మాత్రమే కాకుండా మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 

Kamini Kaushal Died

రేడియో నాటకాల్లో

కామిని గురించి చెప్పాలంటే.. నటి జనవరి 24, 1927న లాహోర్‌లో జన్మించారు. అయితే ఆమె అసలు పేరు కామిని కాదు.. ఉమా కశ్యప్. కామినికి ఏడు సంవత్సరాల వయసులో ఆమె తండ్రి మరణించారు. కామిని బాల్యం నుండే చాలా ప్రతిభావంతురాలు. ఆమె ఒక తోలుబొమ్మ థియేటర్‌ను సృష్టించి.. ఆల్ ఇండియా రేడియోలో రేడియో నాటకాలు ప్రదర్శించింది. 

అప్పట్లో రేడియోలో ఆమె గొంతుకు ముగ్ధుడైన చలనచిత్ర నిర్మాత చేతన్ ఆనంద్.. ఆమెకు ఉమా కామిని అని పేరు పెట్టాడు. తన భార్య పేరు కూడా ఉమా (ఆనంద్), ఆమె కూడా ఆ చిత్రంలో ఒక భాగం కాబట్టి చేతన్ స్వయంగా ఆమెకు కామిని అని పేరు పెట్టాడు. కామిని చిత్రాలలో బిరాజ్ బహు (1954), ఆర్జూ (1950), షబ్నం (1949), జిద్ది (1948), ఆగ్ (1948), నదియా కే పార్ (1948), షహీద్ (1948) ఉన్నాయి. కామిని ‘‘చెన్నై ఎక్స్‌ప్రెస్’’ చిత్రంలో షారుఖ్ ఖాన్ అమ్మమ్మగా కూడా నటించింది.

Advertisment
తాజా కథనాలు