Stock Market : రెపో రేట్ల ప్రకటన తర్వాత 270 పాయింట్లు జంప్ అయిన సెన్సెక్స్
రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను యధాతథంగా ఉంచుతున్నామని ప్రకటించాక సెన్స్‌క్స్ అమాంతం 270 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు పెరిగి 24, 680 దగ్గర ఉంది.
రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను యధాతథంగా ఉంచుతున్నామని ప్రకటించాక సెన్స్‌క్స్ అమాంతం 270 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు పెరిగి 24, 680 దగ్గర ఉంది.
దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో వివిధ బ్యాంకులకు 19 రోజులు సెలవులు ఉన్నాయి. పండుగలు, జాతీయ దినోత్సవాలు, ప్రాంతీయంగా ఉన్న పండుగల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులను ప్రకటించింది.
దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.16 వరకు పెరిగినట్లు తెలిపింది. అయితే గృహ వినియోగం కోసం వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదని తెలిపాయి.కేవలం కమర్షియల్ సిలిండర్ల ధరలు మాత్రమే పెరిగాయి.
అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ గేమింగ్, రైలు టిక్కెట్లు, వడ్డీ రేట్లు, UPI, నేషనల్ పెన్షన్ సిస్టమ్, గ్యాస్ ధరలు మారనున్నాయి. ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు నేటి నుంచి అమల్లోకి రానుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. HP 15 రూ.36,990, Dell Vostro రూ.35,990, Acer Aspire Lite రూ.26,990, Asus Vivobook 15 రూ.33,990, Lenovo V15 G4 రూ.34,980, Dell 15 రూ.33,990కే కొనుక్కోవచ్చు.
ఒప్పో A6 5G స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో విడుదలైంది. ఇది 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రధాన కెమెరా వంటి శక్తివంతమైన ఫీచర్లతో వచ్చింది. 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,000గా కంపెనీ నిర్ణయించింది.
జోహో రూపొందించిన స్వదేశీ మెసేజింగ్ యాప్ 'అరట్టై'. ఇది టెక్స్ట్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ చాట్లు, మీడియా షేరింగ్‌ను అందిస్తుంది. కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. డేటా ఇండియా సర్వర్లలో సురక్షితంగా ఉంటుంది.
వివో V60e 5G ఫోన్ 200MP ప్రధాన కెమెరా, 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. ఇందులో 120Hz OLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 7న విడుదల అవుతుందని అంచనా.
MOTOROLA G96 5G ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకే లభిస్తోంది. బేస్ వేరియంట్ అసలు రూ.17,999 ఉండగా ఇప్పుడు రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇందులో 144Hz, 3డీ కర్వ్డ్ pOLED డిస్ప్లే, 50ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.