/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
ఆసియా మార్కెట్లలో గందరగోళం నెలకొంది. వారంలోని చివరి రోజైన శుక్రవారం మొత్తం అన్నీ కుప్పకూలాయి. ప్రారంభం నుంచే భారత స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచే క్రాష్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క 30 షేర్ల సెన్సెక్స్ ప్రారంభంలో 600 పాయింట్లకు పైగా పడిపోయింది, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క నిఫ్టీ కూడా 150 పాయింట్లు పడిపోయింది. భారతి ఎయిర్‌టెల్ , హెచ్‌సిఎల్ టెక్ వంటి అనేక పెద్ద కంపెనీల షేర్లు ప్రారంభంలోనే కుప్పకూలాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 1100 పాయింట్లకు పైగా పడిపోయిన తర్వాత క్రాష్ అవ్వగా, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 300 పాయింట్లకు పైగా క్షీణించింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 26 క్షీణించగా, 4 లాభాలను ఆర్జించాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాక్‌లు అమ్మకాలతో జోరుగా సాగాయి.
అట్టఅడుగుకు పది షేర్లు..
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభం కాగానే, బిఎస్ఇ సెన్సెక్స్ 83,150 వద్ద ప్రారంభమైంది. ఇది మునుపటి ముగింపు 83,311 నుండి తగ్గింది. అయితే ఈ క్షీణత నిమిషాల్లోనే తీవ్రంగా మారింది. దీంతో సెన్సెక్స్ 620 పాయింట్లు పడిపోయి 82,690 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ కూడా ప్రారంభంలోనే కుప్పకూలింది. NSE ఇండెక్స్ దాని మునుపటి ముగింపు 25,509 నుండి 25,433 వద్ద ప్రారంభమైంది. తరువాత అకస్మాత్తుగా 175 పాయింట్లు క్షీణించి 25,334 వద్ద ట్రేడవుతోంది. BSE లార్జ్-క్యాప్ కేటగిరీలోని 30 స్టాక్‌లలో 27 రెడ్ జోన్‌లో ఉన్నాయి. బ్లాక్ డీల్ వార్తల తర్వాత టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ షేర్లు దాదాపు 4% తగ్గి ₹2,012కి పడిపోయాయి. వీటితో పాటు.. HCL టెక్ (2%), TCS (1.50%), టెక్ మహీంద్రా షేర్ (1.40%) చాలా లో గా ట్రే్ అవుతున్నాయి. మిడ్‌క్యాప్ కేటగిరీని పరిశీలిస్తే, హెక్స్ట్ షేర్ (4%), ఎస్కార్ట్స్ షేర్ (3%), భారతీ హెక్సాకామ్ షేర్ (2.90%) , కేన్స్ షేర్ (2.77%) క్షీణతతోట్రేడవుతున్నాయి. స్మాల్ క్యాప్ కంపెనీలలో, బ్లిస్GVS షేర్ (16%) మరియు అంబర్ షేర్ (14%) క్షీణించాయి.
పడిపోయిన ప్రపంచ మార్కెట్లు..
ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ ఇండెక్స్ 2.16% తగ్గి 49,783 వద్ద, కొరియా కోస్పి 2.49% తగ్గి 3,926 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.11% తగ్గి 26,190 వద్ద, చైనాకు చెందిన షాంఘైకాంపోజిట్ 0.16% తగ్గి 4,001 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నవంబర్ 6న, US డౌ జోన్స్ 0.84% ​​తగ్గి 46,912 వద్ద ముగిసింది. ఇంతలో, నాస్‌డాక్కాంపోజిట్ 1.90%, S&P 500 1.12% క్షీణించి ముగిశాయి. నవంబర్ 6న ఎఫ్‌ఐఐలు రూ.3,605 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డిఐఐలు రూ.4,814 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Follow Us