Investment Plans: బంగారం vs సిప్.. ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలో మీకు తెలుసా?

అబ్బాయిలు ఎక్కువగా సిప్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మహిళలు మాత్రం బంగారం బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు కొనడం వంటివి చేస్తారు. అయితే ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

New Update
sip vs gold

sip vs gold

ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉండటానికి బంగారం లేదా సిప్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అబ్బాయిలు ఎక్కువగా సిప్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మహిళలు మాత్రం బంగారం బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు కొనడం వంటివి చేస్తారు. అయితే ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

భారీగా లాభాలు వస్తాయని..

మహిళల దగ్గర డబ్బులు ఉంటే చాలు బంగారం కొనేస్తారు. ఏదో విధంగా మహిళలకు బంగారం ఉపయోగపడుతుందని కొనుగోలు చేస్తారు. ఆ బంగారం ఉంటే అవసరం ఉన్నప్పుడు అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. లేదా ఇంకా వేరే ఆర్థిక అవసరాలకు ఉపయోగించవచ్చని భావిస్తారు. ఈ మధ్య కాలంలో బంగారం భారీగా పెరుగుతోంది. గతంలో బంగారం ఎవరైతే ఎక్కువగా కొనుగోలు చేసి ఉంటారో.. వారికి ఇప్పుడు మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే బంగారంపై ఎంత పెట్టుబడి పెట్టినా కూడా వృద్ధి చాలా నెమ్మదిగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. SIP ( సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్)లో చిన్న మొత్తంలో ఎక్కువ ఏళ్లు పెట్టుబడి పెట్టినా కూడా భారీగా లాభాలు వస్తాయని అంటున్నారు. దీనిపై ఇన్వెస్ట్ చేయడం వల్ల కాలక్రమేణా వడ్డీ పెరుగుతుంది. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు భారీగా వస్తాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ సిప్ అనేది స్టాక్  మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ అంత రిస్క్ అయితే ఉండదు. ప్రతినెలా సిప్‌ను ఎక్కువ ఏళ్లు కట్టడం వల్ల భారీగా లాభాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. సిప్‌ను కనీసం పదేళ్లు అయినా  కట్టాలి. ఇలా ఎన్నేళ్లు అయితే సిప్ కడతారో దాని బట్టి డబ్బు రెట్టింపు అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Stock Market: దుమ్ము రేపుతున్న 10 స్టాక్స్...లాభాల్లో స్టాక్ మార్కెట్

సిప్ కంటే బంగారం ధర ఎప్పటికీ పడిపోదు. బంగారం ధర పెరుగుతుంటే.. సిప్ ధర తగ్గిపోతుంది. అయితే తక్కువ సమయంలో లాభాలంటే బంగారం, ఎక్కువ  కాలంలో లాభాలంటే సిప్ బెటర్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారంపై సగటు రాబడి దాదాపుగా 8 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. అయితే ఇది కొన్నిసార్లు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతుంది. 12 నుంచి 15 శాతం వరకు సిప్‌లో లాభాలు వస్తాయి. అయితే నగలు తయారు చేసిన బంగారం అమ్మడం కష్టం. కానీ డిజిటల్ లేదా ఈటీఎఫ్ గోల్డ్ అయితే వెంటనే అమ్మవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో కూడా మీరు ఎన్ని ఇయర్స్ అని పెట్టుకునే బట్టి ఉంటుంది. దాని బట్టే మీకు లాభాలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:  Blue Cloud Softech : బ్లూ క్లౌడ్ సోఫ్టెక్ సొల్యూషన్స్-ఇజ్రాయెల్ సంస్థ మధ్య భారీ ఒప్పందం!

Advertisment
తాజా కథనాలు