Best Mileage Bikes: తోపు భయ్యా.. రూ.56 వేల బడ్జెట్‌లో 75 కి.మీ మైలేజీ అందించే టాప్ బైక్‌లు..!

ప్రస్తుతం చాలా మంది టూ వీలర్లపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో బైక్‌లకు డిమాండ్ పెరిగింది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర ప్రదేశాలకు పనుల నిమిత్తం పోయేవారు ఎక్కువగా టూ వీలర్లనే ఉపయోగిస్తున్నారు.

New Update
Best Mileage Hero Bikes

Best Mileage Hero Bikes

ప్రస్తుతం చాలా మంది టూ వీలర్లపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో బైక్‌లకు డిమాండ్ పెరిగింది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర ప్రదేశాలకు పనుల నిమిత్తం పోయేవారు ఎక్కువగా టూ వీలర్లనే ఉపయోగిస్తున్నారు. మరి మీరు కూడా ఒక చక్కటి బైక్‌ను అతి తక్కువ ధరలోనే కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?.. అది కూడా లీటర్ పెట్రోల్‌కు 70 నుంచి 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్‌ను చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ప్రముఖ బ్రాండ్ కంపెనీ హీరో నుండి బెస్ట్ లోయెస్ట్ హీరో బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. 

Hero HF Deluxe

Hero HF Deluxe దేశంలోనే అత్యంత సరసమైన బైక్‌లలో ఒకటి. దీన్ని కేవలం రూ.55,992 ఎక్స్ షోరూమ్ ధరతో కొనుక్కోవచ్చు. ఈ బైక్ లీటర్‌కు 70 నుంచి 75 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో 9.1-లీటర్ పెట్రోల్ ట్యాంక్ అందించారు. Hero HF Deluxe 97.2cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 

Hero Splendor Plus

Hero Splendor Plus బైక్ మార్కెట్‌లో రూ.75,441 ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తుంది. ఇది 97.2cc, BS6 -కంప్లైంట్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది లీటర్‌ పెట్రోల్‌కు 70 నుంచి 80 కిమీ మైలేజీ అందిస్తుంది. దీనికి 9.8 లీటర్ పెట్రోల్ ట్యాంక్ అందించారు. ఈ బైక్ డిజిటల్-అనలాగ్ స్పీడోమీటర్, సౌకర్యవంతమైన సీటింగ్‌, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్‌ను కలిగి ఉంటుంది. 

Hero Passion Plus

అధిక మైలేజ్ కోరుకునే వారికి Hero Passion Plus కూడా ఒక మంచి ఎంపిక. దీనిని కేవలం రూ.78,543 ఎక్స్ షోరూమ్ ధరతో కొనుక్కోవచ్చు. ఇది లీటర్ పెట్రోల్‌కు 70 నుంచి 75 కి.మీ మైలేజీ అందిస్తుంది. Hero Passion Plus బైక్ 97.2cc ఇంజిన్‌, స్మూత్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

అందువల్ల ఒక చక్కటి బైక్‌ను అతి తక్కువ ధరలో, ఎక్కువ మైలేజీ కోసం కొనుక్కోవాలనుకుంటే హీరో కంపెనీ బైక్‌లు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు