Toyota recall: ఈ కార్లు కొన్నవారికి బిగ్ షాక్.. 10 లక్షల కార్లు రీకాల్

టయోటా కంపెనీ తన 10 లక్షల కార్లను రీకాల్ చేసింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిన లేఖలో.. టయోటా, లెక్సస్, సుబారు బ్రాండ్‌లలో సుమారు 1,024,407 వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వెల్లడించింది. 

New Update
Toyota recalls over 1 million vehicles (1)

Toyota recalls over 1 million vehicles

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా నుంచి తాజాగా సంచలన ప్రకటన వెలువడింది. ఈ కంపెనీ తన 10 లక్షల కార్లను రీకాల్ చేసింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిన లేఖలో.. టయోటా, లెక్సస్, సుబారు బ్రాండ్‌లలో సుమారు 1,024,407 వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వెల్లడించింది. 

పనోరమిక్ వ్యూ మానిటర్ (PVM) సిస్టమ్‌లోని లోపం కారణంగా ఈ రీకాల్ జరిగింది. దీని వలన వాహనం రివర్స్‌లో ఉన్నప్పుడు రియర్‌వ్యూ కెమెరా ఆగిపోవడం లేదా పనిచేయకపోవడం జరుగుతుంది. దీంతో పనోరమిక్ వ్యూ మానిటర్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన 2022-2026 మోడల్-ఇయర్ టయోటా మాత్రమే కాకుండా.. లెక్సస్, సుబారు వాహనాలను రీకాల్ ప్రభావితం చేస్తుంది. 

Toyota recalls

2023-2025 టయోటా బీజెడ్4ఎక్స్
2025-2026 టయోటా క్యామ్రీ
2023-2026 టయోటా క్రౌన్
2025 టయోటా క్రౌన్ సిగ్నియా  
2024-2026 టయోటా గ్రాండ్ హైలాండర్  
2023-2025 టయోటా హైలాండర్
2024-2025 టయోటా ల్యాండ్ క్రూయిజర్
2023-2025 టయోటా మిరాయ్
2023-2025 టయోటా ప్రియస్
2023-2025 టయోటా RAV4
2025 టయోటా సియెన్నా
2023-2024 టయోటా వెన్జా

2023-2025 లెక్సస్ ఈఎస్
2024-2025 లెక్సస్ జీఎక్స్
2024-2025 లెక్సస్ ఎల్సీ
2023-2025 లెక్సస్ ఎల్ఎస్
2022-2025 లెక్సస్ ఎల్ఎక్స్
2022-2025 లెక్సస్ ఎన్
2023-2026 లెక్సస్ ఆర్ఎక్స్  
2023-2025 లెక్సస్ ఆర్జెడ్
2024-2026 లెక్సస్ టీఎక్స్

2023-2025 సుబారు సోల్టెర్రా

ఈ వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులు దగ్గర్లోని డీలర్‌షిప్‌కు వెళ్తే అక్కడ పార్కింగ్ అసిస్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అప్‌డేట్ చేస్తామని టయోటా తెలిపింది. పరిష్కారం అందుబాటులోకి వచ్చిన తర్వాత యజమానులకు సమాచారాన్ని పంపుతామని టయోటా తెలిపింది.

ఈలోగా ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే.. టయోటా కస్టమర్ సర్వీస్ హాట్‌లైన్‌ను 1-800-331-4331 వద్ద సంప్రదించవచ్చు. టయోటా రీకాల్ నంబర్‌లు 25TB13, 25LB06.. సుబారు రీకాల్ నంబర్ WRE25.

Advertisment
తాజా కథనాలు