/rtv/media/media_files/2025/11/07/best-5g-smartphones-under-25000-1-2025-11-07-18-42-57.jpg)
best 5g smartphones under 25000
మీరు రూ.25వేల లోపు ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?. అయితే ఇదే సరైన సమయం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. Realme, Poco, Vivo, Nothing, OnePlus వంటి కంపెనీలు మిడ్-రేంజ్‌లో అధునాత స్పెసిఫికేషన్‌లతో ఫోన్‌లను అందిస్తున్నాయి.
Realme P4 Pro 5G
Realme P4 Pro 5Gలోని 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. Realme P4 Pro 5G 1280×2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 7,000mAh బ్యాటరీ అందించారు.
Vivo Y400 5G
Vivo Y400 5Gలోని 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. Vivo Y400 5G.. 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,000mAh బ్యాటరీ ఉంది.
OnePlus Nord CE 5 5G
OnePlus Nord CE 5 5Gలోని 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999 గా కంపెనీ నిర్ణయించింది. ఇది 6.77-అంగుళాల OLED డిస్‌ప్లేను 2392×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7,100mAh బ్యాటరీ అందించారు.
Nothing Phone 3a
Nothing Phone 3aలోని 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. ఇది 1080x2392 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.77-అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 4nm ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ డిజిటల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Poco X7 Pro 5G
Poco X7 Pro 5Gలోని 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. ఇది 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 90W హైపర్‌ఛార్జ్‌కు మద్దతు ఇచ్చే 6,550mAh బ్యాటరీ అందించారు.
Follow Us