New Smartphone: నాలుగు కెమెరాలతో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఊరమాస్..!

హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. కిరిన్ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ 16GB వరకు RAMని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

New Update
Huawei Mate 70 Air Price

Huawei Mate 70 Air Price

హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్(new-smartphone) Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. కిరిన్ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ 16GB వరకు RAMని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. Huawei Mate 70 Air.. 6500mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Also Read :  రూ.20వేల లోపు కళ్లుచెదిరే మొబైల్స్.. చూస్తే వెంటనే కొనేస్తారు భయ్యా..!

Huawei Mate 70 Air Price

Huawei Mate 70 Air స్మార్ట్‌ఫోన్ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 52,000గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 12GB/512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 58,000, 16GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 58,000, 16GB/512GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 65,000గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలోని కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది అబ్సిడియన్ బ్లాక్, ఫెదర్డ్ వైట్, గోల్డ్ & సిల్వర్ బ్రోకేడ్ కలర్‌లలో లభిస్తుంది. 

Also Read :  ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లపై అమెజాన్ కొత్త సేల్.. సగం ధరకే కొనేయొచ్చు మావా..!

Huawei Mate 70 Air Specs

Huawei Mate 70 Air.. 7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1320x2760 పిక్సెల్‌ల రిజల్యూషన్, 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటు, 2160Hz PWM డిమ్మింగ్ ను కలిగి ఉంది. Huawei Mate 70 Air ఫోన్ 16GB RAMతో వస్తుంది. ఇది కిరిన్ 9020A చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. హువావే మేట్ 70 ఎయిర్ కంపెనీ హార్మొనీOS 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. Huawei Mate 70 Air.. 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. 

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Huawei Mate 70 Airలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 1.5-మెగాపిక్సెల్ మల్టీ-స్పెక్ట్రల్ కలర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.

Advertisment
తాజా కథనాలు