Recharge Plans: జియో, ఎయిర్‌టెల్ యూజర్ల జేబుకు చిల్లు.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ 10 శాతం రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇవి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సామాన్యులపై మరింత భారం పెరగనుంది.

New Update
Airtel

Airtel

ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఈ క్రమంలోనే టెలికాం సంస్థలు భారీగా రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచింది. అయితే మరోసారి మొబైల్ డేటా ప్లాన్స్ ధరలను పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ 10 శాతం రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సామాన్యులపై మరింత భారం పెరగనుంది.  ప్రీపెయిడ్ డేటా వినియోగదారులు కనీసం రోజుకు 1.5 GB డేటా అందించే ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలంటే  గతంలో రూ.249 నుంచి స్టార్ట్ అయ్యేవి. అవి ఇప్పుడు రూ.299 నుంచి మొదలవుతున్నాయి. అంటే ప్లాన్ ధర సుమారుగా రూ.50 వరకు పెరిగింది. తక్కువ డేటా ప్లాన్లు అసలు లేవు. అయితే ఇప్పుడు వీటిపై 10 శాతం పెంచనున్నట్లు సమాచారం. ఇవి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పెరగనున్న ఈ ధరల వల్ల సామాన్యులపై ఎక్కువగా భారం పడనుందని పలువురు అంటున్నారు. 

ఇది కూడా చూడండి:  New Smartphone: నాలుగు కెమెరాలతో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఊరమాస్..!

ఇది కూడా చూడండి: Investment Plans: బంగారం vs సిప్.. ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలో మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు