Flipkart Mobile Offers: కెవ్ కేక.. రూ.3,749కే రివర్స్ ఛార్జింగ్ మొబైల్.. వాటర్‌ఫ్రూప్ కూడా..!

ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో చంపేస్తోంది. ఇటీవల దసరా, దీపావళి సందర్భంగా పలు సేల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకుంది. అనేక వస్తువులపై భారీ తగ్గింపులు అందించి అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందించింది.

New Update
Flipkart Mobile Offers (1)

Flipkart Mobile Offers

ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో చంపేస్తోంది. ఇటీవల దసరా, దీపావళి సందర్భంగా పలు సేల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకుంది. అనేక వస్తువులపై భారీ తగ్గింపులు అందించి అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందించింది. అయితే ఇప్పుడు ఆ సేల్స్ ముగిసాయి. కానీ ఫ్లిప్‌కార్ట్ మాత్రం ఫోన్లపై ఆఫర్లు తగ్గించలేదు. తాజాగా మరొక అద్భుతమైన ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. 

అందువల్ల మీరు ఒక కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. Poco F7 5G మంచి ఎంపిక. ఈ-కామర్స్ సైట్ Flipkart ఈ Poco F7 5G స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా భారీ ధర తగ్గింపులు అందిస్తోంది. వినియోగదారులు తమ పాత ఫోన్‌ను మార్పిడి చేసుకోవడం ద్వారా మరింత అదనపు పొదుపులను పొందవచ్చు.  

Poco F7 5G offers

Poco F7 5Gలోని 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.31,999లకు ప్రారంభించబడింది. ఇప్పుడు ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. దీని తర్వాత Poco F7 5G రూ.28,999కి దొరుకుతుంది. అలాగే రూ.25,250 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. ప్రస్తుత ఫోన్ పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం వర్తిస్తే.. Poco F7 5G కేవలం రూ.3,749లకే సొంతం చేసుకోవచ్చు. 

Poco F7 5G specs

Poco F7 5G.. 1280x2772 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Xiaomi HyperOS 2.0 పై నడుస్తుంది. Poco F7 5G.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,550mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Poco F7 5G ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66+IP68+IP69 రేటింగ్‌తో వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Poco F7 5Gలో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 

Advertisment
తాజా కథనాలు